Iyengar Yoga in Chennai :
చెన్నైలో అయ్యంగార్ యోగాకు ఎంతో పేరుంది. 100 ఏండ్లుగా ఈ యోగా ప్రసిద్ధి చెందింది. బెల్లూర్ కృష్ణమాచార్ సుందరారాజా అయ్యంగార్ ఈ ‘అయ్యంగార్ యోగా’ శైలి వ్యవస్థాపకుడు. ప్రపంచ ఆధునిక యోగా గురువులలో ఆయన ప్రసిద్ధుడు. యోగా సాధన మీద ఎన్నో పుస్తకాలు రచనలు చేశారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో యోగా అనివార్యమైంది. తప్పకుండా యోగా చేసి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
అయితే ఈ యోగాలో లైట్ ఆన్ యోగా, లైట్ ఆన్ ప్రాణాయామ, లైట్ ఆన్ యోగా సూత్ర ఆఫ్ పతాంజలి, లైట్ ఆన్ లైఫ్ అతి ముఖ్యమైనవి. కాగా, ఈ యోగాకు విదేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. శరీరం ఒక ప్రయోగ శాల.. నేను శరీరాన్ని ఒక వస్తువుగా సాగదీయను, నేను యోగాను స్వీయ శక్తి నుంచి శరీరం వైపు మొదలు పెడుతున్నాను. అనేది అయ్యంగార్ యోగాలో చెబుతుంటారు.
అయ్యంగార్ యోగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ యోగా సూత్రం మనిషి జ్నానోదయాన్ని ఎనిమిది రెట్లు పెంచడం. యోగా అనేది కేవలం కాలరీలను కరిగించడం కాదు. అదోక అద్భుత శక్తి వనరు.పిల్లల నుంచి పెద్దల దాకా లోతైన ఆత్మశాంతి, మానసిక ధృడత్వం కోసం శారీరక స్థితిని సాధించడానికి ఆసనాలు వేస్తుంటారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అయ్యంగార్ యోగా చేస్తున్నారు. అయితే ఎవరైనా ఈ యోగా చేయవచ్చు. వృద్ధాప్యం, జబ్బుపడిన వారికి ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెబుతుంటారు. మొదట శరీరం, ఆ తర్వాత మనస్సు, వివిధ రకాల జీవనశైలి బోధించే విధంగా క్రాస్-లెగ్డ్ నాభిని చూడటం అయ్యంగార్ ఆసనాల్లో భాగం కాదు. మనస్సును కేంద్రీకరించడానికి, శరీరం కేంద్రీకృతమై ఉండాలి. మీరు శారీరక నిశ్చలతను ఛేదించిన తర్వాత మాత్రమే మీరు ఉన్నత రంగాలలోకి వెళ్లాలని అనుకోవచ్చు. అతనితో, శరీరం మృదువుగా మరియు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రతి సెషన్ ముగింపులో ప్రాణాయామం ఉంటుంది. అయ్యంగార్ యోగా ఒక స్వచ్ఛమైన విశ్వసనీయతను కలిగి ఉంది.