Ramcharan’s daughter : ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ ఘట్టం పూర్తి అయ్యింది అనే చెప్పాలి.. మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా రామ్ చరణ్ కూతురు పేరు ఏం పెడతారా? అనే క్యూరియాసిటీ ఉంది.. మరి ఆ క్యూరియాసిటీ ఈ రోజుతో ముగిసింది అనే చెప్పాలి. ఎంతో గ్రాండ్ గా రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురు ఊయల ఫంక్షన్ జరిగింది.
ఈ వేడుక లోనే చిరంజీవి మనవరాలికి నామకరణం కూడా చేసారు.. దీని తర్వాత చిరంజీవి మనవరాలి పేరు ఏంటో రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో ఆయన పేరు రివీల్ చేస్తూనే ఆ పేరును ఎక్కడ నుండి తీసుకున్నారు? పేరుకు అర్ధం ఏంటి అనేది కూడా రివీల్ చేసారు..
మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరు బయటకు రావడంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా సందడి మొదలైంది. రామ్ చరణ్ కూతురు పేరు ”క్లీంకార”.. ఈ పేరును రివీల్ చేస్తూ ఈ పేరు లలితా సహస్రనామ నామం నుండి తీసుకున్నాం అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.
ఈ పేరు బయటకు రాగానే ‘క్లీంకార’ అంటే అర్ధం ఏంటా అని మరింత ఆరా తీయడం మొదలు పెట్టారు.. క్లీంకార పేరుకు అర్ధం ఏమిటంటే.. లలిత సహస్త్ర నామాల్లో బీజాక్షరం అని ప్రకృతి శక్తికి ప్రతిరూపం అని ఆధ్యాత్మికతను పెంపొందించేలా శక్తిని శుద్ధి చేస్తుంది అని అర్ధం అట.. ఈ పేరు వెనుక ఇంత అర్ధం ఉందా అని తెలుసుకున్న వారు ఆశ్చర్య పోతున్నారు.
ReplyForward
|