29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Welcome to Modi : మోడీకి అమెరికా రెడ్ కార్పెట్ స్వాగతం వెనుక స్టోరీ ఇదీ

    Date:

    welcome to Modi
    welcome to Modi

    Welcome to Modi : ఈ నెలాఖరులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకమైన అమెరికా పర్యటనలో వాషింగ్టన్‌ను సందర్శించనున్నారు. ఇది చారిత్రాత్మక పర్యటనగా చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో రెండు దేశాల ప్రధాన విభేదాలు ఉన్నప్పటికీ వాషింగ్టన్ -బీజింగ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అమలు చేయడంలో బిడెన్ పరిపాలనకు విజయాల నేపథ్యంలో వాషింగ్టన్ అమెరికా అధికారిక నివాసంలోకి మోదీకి ఘన స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు.

    ఇండో-పసిఫిక్‌లో నెట్‌వర్క్డ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్‌లో భారతదేశం ఎంతో ముఖ్య భాగంగా అమెరికా గుర్తిస్తోంది. చైనీస్ దూకుడును ఎదుర్కొనేందుకు భారత్ పై విశ్వాసం, దాని సామర్థ్యాలను పెంపొందించాలనే దీర్ఘకాలిక వ్యూహంలో భారత ప్రధాని మోడీకి అమెరికా స్వాగతం పలుకుతోంది.

    ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన కొద్దికాలానికే, అమెరికాను దాటి చైనా విజృంభిస్తోంది. యురోపియన్ దేశాలపై అమెరికా కంటే చైనా ప్రభావం చూపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ను మించి వనరులు చైనా వినియోగించుకొని ఎదుగుతోందని.. ఇండో-పసిఫిక్ ప్రాంతం మరోసారి అమెరికా, చైనా ప్రచ్చన్న యుద్దానికి ప్రతీకగా మారుతుందని భయపడ్డారు.

    నిజానికి, ఇది బీజింగ్ కోరిక అయి ఉండవచ్చు. అయితే, అందుకు విరుద్ధంగా అమెరికా భారత్ తో స్నేహహస్తం చాటుతోంది. బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉక్రేనియన్లకు బిలియన్ల సైనిక , ఆర్థిక సహాయాన్ని అందించినప్పటికీ మరియు ఐరోపాతో దాని సంకీర్ణాన్ని బలోపేతం చేసినప్పటికీ, ఇది దాని ఇండో-పసిఫిక్ వ్యూహం లో భాగం కాదు. చైనాకు చెక్ పెట్టేందుకే భారత్ కు ప్రాముఖ్యతను ఇస్తూ మన మోడీకి అమెరికా ఘన స్వాగతం పలుకుతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Welcome to Modi : పార్లమెంట్ నూతన భవనంలో.. మోదీకి ఘన స్వాగతం

    Welcome to Modi : న్యూ ఢిల్లీలోని నూతన భారత పార్లమెంటు...