
c voter suervyఇప్పుడున్న పరిస్థితుల్లో కర్నాటక ఎన్నికలు అన్ని పార్టీలకు టఫ్ టాస్కే. రాబోయే జాతీయ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకోల్పడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్,బీజేపీ తన శక్తి మేరకు కర్నాటకలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నా యి. ఈ రెండు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి కీలక నేతలు కర్నాటకలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఈనేపథ్యంలో అసలు కర్నాటకలో గెలుపు అవకాశాలు ఎవరికున్నాయనే అంశంపై Tv9 కన్నడ చానెల్,సీ ఓటర్స్ సర్వే సంచలన విషయాలను బయటపెట్టింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి తప్పదని తేల్చేసింది. కన్నడ నాట కాంగ్రెస్ గెలుపు దిశగా పయనిస్తున్నట్లు స్పష్టం చేసింది. కర్నాటకలో మొత్తం శాసన సభ స్థానాల సంఖ్య 224. అయితే వీటిలో కాంగ్రెస్ 106 నుంచి 116 స్థానాల వరకు సాధించ వచ్చని తెలిపింది. కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 113 సీట్లు అవసరమవుతాయి. అయితే సీ ఓటర్స్ సర్వే ప్రకారం 106-116 సీట్లను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలున్నాయని చెబుతుండడంతో.. దాదాపు ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసే అవకాశలున్నట్లు తేల్చేసింది.
మరోవైపు ప్రస్తుతం కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి 79-89 సీట్లే రావొచ్చని వెల్లడించింది. మాజీ సీఎం కుమారస్వామికి సంబంధించిన జేడీఎస్‌కు 24-34 స్థానాలు రావొచ్చని తెలిపింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు మరో ఐదు స్థానాల వరకు గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే Tv9 కన్నడ చానెల్,సీ ఓటర్స్ సర్వే ఫలితాలు ఎలా ఉన్న ఈ రెండు సంస్థలు విడుదల చేసిన ముందస్తు అంచనా రిజర్ట్స్‌తో బీజేపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాఉండగా..కాంగ్రెస్






