Popular Celebrity : కొందరు వ్యక్తులు సెలబ్రిటీలను పెళ్లి చేసుకున్న తర్వాత పాపులర్ అవుతారు. మరికొందరు పాపులారిటీ వచ్చిన తర్వాత ఇతర సెలబ్రిటీలను పెళ్లి చేసుకొని, సోషల్ మీడియాలో క్రేజ్ కంటిన్యూ చేస్తారు. అలాంటి వారిలో ఒకరు ధనశ్రీ వర్మ. టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్యగా ఈమె నెటిజన్లకు పరిచయం. కానీ ఆమె ఎవరని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు.
DY పాటిల్ కాలేజీలో డెంటిస్ట్ కోర్సు
ధనశ్రీ వర్మ 1996, సెప్టెంబర్ 27 యూఏఈలోని దుబాయ్‌లో జన్మించింది. 2014లో ఇండియాకు వచ్చి ముంబైలోని DY పాటిల్ కాలేజ్ లో డెంటిస్ట్రీ చదివింది. ధనశ్రీ వర్మకు డ్యాన్స్ అంటే ఇష్టం. యూట్యూబ్‌లో ఓ ఛానెల్ క్రియేట్ చేసి వీడియోలను అప్‌లోడ్ చేస్తుండేది. ఈ వీడియోలతోనే సోషల్ మీడియాలో పాపులర్ గా మారి భారీ ఫ్యాన్ ను సంపాదించకుంది.
సంపాదన ఎంతో తెలుసా?
ధనశ్రీ వర్మ యూట్యూబ్ ఛానల్ కు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, కొరియోగ్రఫీ వంటి, తదితర మాధ్యమాల నుంచి బాగా సంపాదిస్తోంది. ABP రిపోర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ధనశ్రీ నెట్‌వర్త్ రూ.3 మిలియన్ డాలర్లు. అంటే మన రూపీల్లో చూస్తే దాదాపు రూ.24 కోట్లు అన్నమాట.
చాహల్‌తో స్నేహం, లవ్, మ్యారెజ్
ధనశ్రీకి డ్యాన్స్ వీడియోలతోనే యుజ్వేంద్ర చాహల్ పరిచయం అయ్యాడు. ఆమె డాన్స్ కు ముగ్ధుడై ఆమె వద్ద నేర్చుకున్నాడు. దీంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. 2020, డిసెంబర్‌లో మ్యారేజ్ వరకు తీసుకెళ్లింది.
విడాకుల రూమర్స్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ధనశ్రీ తన లైఫ్ లో జరిగే పర్సనల్స్ కూడా షేర్ చేస్తుంది. ఈ క్రమంలో తన ఇన్ స్టాలో చాహాల్ ఇంటిపేరును తొలగించింది. దీంతో చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారన్న రూమర్స్ వ్యాపించాయి. టీమిండియా మరో ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీతో సన్నిహితంగా మెలగడమే కారణమని దారుణంగా ట్రోల్ చేశారు.
ఈ విషయంపై చహల్- ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. ‘మేం కలిసి ఆనందంగా ఉంటున్నాం.’ అని చెప్పడంతో ఇలాంటి రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడింది. ధనశ్రీ వర్మ దిగిన ఒక ఫొటో కారణంగా ఆమె మరోసారి ట్రోల్స్‌కు గురైంది.
‘ఝలక్ దిఖ్లాజా’ అనే టీవీ షోలో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో ధనుశ్రీ సన్నిహితంగా దిగిన ఫొటో బయటకు వచ్చింది. ప్రతీక్ స్వయంగా ఈ పిక్ ను తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు ధనశ్రీ తీరుపై మరో సారి విమర్శలు గుప్పిస్తున్నారు.