
YouTube trend మిస్టర్ బీస్ట్ ఈ పేరు వింటే గుర్తుకు వచ్చేది అడ్వంచర్ మ్యాన్. అమెరికాకు చెందిన జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్ సన్ యూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ గా ఛానెల్ ఓపెన్ చేశాడు. ఇప్పటి (ఆగస్ట్ 8వ తేదీ) వరకు ఆయన యూట్యూబ్ సబ్ స్ర్కైబర్స్ 174 మిలియన్స్ ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. యూ ట్యూబ్ లోనే రెండో సబ్ స్ర్కైబర్స్ కలిగిన వ్యక్తి మిస్టర్ బీస్ట్.
అడ్వంచర్ వీడియోలు, థ్రిల్లింగ్ వీడియోలు, పన్నీ వీడియోలు ఇలా ప్రతీ అంశాన్ని టచ్ చేస్తూ ఆయన అప్ లోడ్ చేస్తుంటారు. దీనితో పాటు అతనికి మరో 3 ఛానళ్లు ఉన్నాయి. వాటి నుంచి కూడా ఆయన వీడియోలు అప్ లోడ్ చేస్తుంటాడు. వీటిలో ది బెస్ట్ చానల్ మాత్రం ‘మిస్టర్ బీస్ట్’. ఎప్పటికీ అడ్వంచర్ వీడియోలు చేసే ఆయన ఈ సారి కూడా అలానే చేశారు. ఆయన చేసిన ఈ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో అత్యంత ట్రెండింగ్ లో నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా సబ్ స్ర్కైబర్స్ ఉన్న ఆయన వీడియో ఎప్పుడు ఎప్పుడు అప్ లోడ్ అవుతుందా అని చాలా దేశాల్లోని వ్యూవర్స్ ఎదురు చూస్తారు. అప్ లోడ్ చేసినవి తక్కువ వీడియోలే అయినా క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇందులో భాగంగా తన స్నేహితులతో సముద్రంలో వారం పాటు ఉన్న వీడియోను ఆయన తన ఛానల్ ద్వారా అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు ఇది అత్యంత భారీ వ్యూవ్స్ ఉన్న వీడియోగా రికార్డ్ సొంతం చేసుకుంది.
తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసిన ‘7 డేస్ స్ట్రాండెట్ ఎట్ సీ’కి విపరీతమైన వ్యూవ్స్ వచ్చాయి. ఈ వీడియో యూట్యూబ్ కే సంచలనంగా మారింది. 24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ సాధించిన నాన్ మ్యూజిక్ వీడియోగా నిలిచింది. ఒక్క రోజులోనే 46 మిలియన్లకు పైగా వ్యూవ్స్ రాగా.. ఇప్పటి వరకు 71 (మధ్యాహ్నం) మిలియన్లు దాటాయి. దీనికి బీస్ట్ తన వ్యూవర్స్ కు థ్యాంక్స్ చెప్పాడు.