32.7 C
India
Monday, February 26, 2024
More

  AP Political Parties : కొత్త ఏడాది.. తాడోపేడో..చావోరేవో అంటున్న ఏపీ పార్టీలు

  Date:

  AP Political Parties
  AP Political Parties

  AP Political Parties : ఏపీలోని రాజకీయ పార్టీలకు ఈ ఏడాది కీలకం కాబోతుంది. అన్నీ పార్టీలకు చావోరేవో అన్నట్టుగా మారిపోయింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మరో మూడు, నాలుగు నెలల్లో ఉండడంతో పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలు, మార్పులు, చేర్పులు, పొత్తులు, చేరికలు..ఇలా అధినేతలు అందరూ బిజీబిజీగా ఉన్నారు. గతంతో పోలిస్తే వైసీపీ బలహీనపడిందన్న అంచనాలు, అభ్యర్థుల మార్పులు,చేర్పులు, టీడీపీ-జనసేన పొత్తు, అలాగే బిగ్ ట్విస్ట్ ఏంటంటే..షర్మిల కాంగ్రెస్ లో చేరడం..ఇలా ఎటూ చూసినా ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

  అధికార వైసీపీ గతంలో సాధించిన 151సీట్ల ఫిట్ ను తలదన్నేలా ‘వైనాట్ 175’ టార్గెట్ పై ధీమా వ్యక్తం చేసింది. ఏ కోశాన అది అయ్యేలా కనపడడం లేదు. దాదాపు 60 సీట్లలో ఇన్ చార్జుల మార్పులు, చేర్పులు, ఎంపీలను ఎమ్మెల్యేలుగా తీసుకొస్తుండడంతో.. సిట్టింగ్ లు సీట్లు కోల్పోయి తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారు. ఇప్పటికే పలువురు బయటపడ్డారు కూడా. దీంతో 11 మార్పులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన వైసీపీ.. రెండు వారాలు దాటిపోయినా సెకండ్ లిస్ట్ ప్రకటనకు వెనకాడుతోంది. ఈ పరిణామాలన్నీ వైసీపీ విజయావకాశాలపై ఎఫెక్ట్ చూపేలా కనపడుతోంది.

  ఇక వైసీపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు కొత్త ఏడాదిలో కీలకంగా మారనున్నాయి. గతంలో పోలిస్తే చంద్రబాబు అరెస్ట్ తర్వాత రగిలిపోతున్న టీడీపీ-జనసేన పార్టీలు దూకుడుగా ముందుకెళ్తుండడంతో.. కొత్త ఏడాదిలో కూటమితో జతకట్టడానికి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేంద్రంలో మూడోసారి  అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉన్నా బీజేపీ వైపే చంద్రబాబు, పవన్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తున్న కూటమికి బీజేపీ తోడైతే వైసీపీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. 2014 సీన్ రిపీట్ కాక తప్పదని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

  అదే టైంలో టీడీపీ-జనసేన కూటమి గెలిస్తే సీఎంగా చంద్రబాబే ఉంటారన్న లోకేశ్ వ్యాఖ్యలు జనసేనలో కలకలం రేపుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇస్తే రెండు పార్టీల ఓట్ల బదలాయింపు పర్ ఫెక్ట్ గా జరుగుతుంది. ఇక ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబుతో భేటీ కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

  కొత్త ఏడాది ప్రారంభంలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీ సారథ్య బాధ్యతలను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశమే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే షర్మిల వర్సెస్ జగన్ పోరు స్టార్ట్ అవుతుంది.. గతంలో కాంగ్రెస్ ఓటుబ్యాంకును జగన్ లాగేసుకున్నారు. ఇప్పుడా ఓటు బ్యాంకును షర్మిల ద్వారా మళ్లీ కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే తాను కోరుకున్నట్టు స్వేచ్ఛను ఇస్తేనే కాంగ్రెస్ లో చేరుతానని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే షర్మిలను కాంగ్రెస్ లో చేరకుండా చేయడానికి జగన్ దూతల్ని సైతం పంపి బుజ్జగిస్తున్నట్లు సమాచారం. మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

  Share post:

  More like this
  Related

  Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

  Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

  Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

  Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

  Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

  Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

  Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

  Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...

  Raj Thackeray : ఎన్డీయే గూటికి రాజ్ థాకరే..!

  Raj Thackeray : లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో శరవేగంగా ఈక్వేషన్లు...

  BJP : పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు..

  BJP : ఏప్రిల్, మేలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార...

  AP Political Parties : ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో తెలుసా?

  AP Political Parties : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ జాతకం మారబోతోందని...