16.3 C
India
Sunday, December 7, 2025
More

    Life is Beautiful Artists : ఆ నటులు ఎక్కడికో ఎదిగిపోయారు..

    Date:

    Life is Beautiful
    Life is Beautiful Movie Artists

    Life is Beautiful Movie Artists : కొందరికి ఉద్యోగం చేసి స్థిరపడాలని కోరిక ఉంటది. మరికొందరికి రాజకీయంగా ఎదగాలని ఆశ ఉంటది. వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడాలని ముందుకు వెళుతుంటారు. వైద్య వృత్తి చేపట్టి గొప్ప డాక్టర్ గా పేరు సంపాదించాలనుకుంటారు. మరికొందరు యువతీ, యువకులు సినిమారంగంలో అడుగుపెట్టి స్థిరపడాలని కోరుకుంటారు. ఆ కోరికతో ఎవరికీ చెప్పకుండా నేరుగా రైలు ఎక్కి హైదరాబాద్ లేదంటే, చెన్నయ్ లో దిగుతారు. కష్టాలను ఎదుర్కొంటూనే కెమెరా ముందు వాలిపోతారు. కొందరు స్థిరపడిపోతారు. మరికొందరు పోటీ తట్టుకోలేక ఇంటిదారి పాడుతారు.

    అందులో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమా ఆర్టిస్టులు ఎంత మారిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. శేఖర్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా దాదాపుగా యువతీ, యువకులతోనే ఉంటాయి. ఆయన కొత్త తరం ఆర్టిస్టులతో నిర్మించిన సినిమా లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. ఆ సినిమా ఇప్పటికి నేటితరానికి కొత్త సినిమా గానే మెప్పిస్తుంది. సినిమా విడుదల అయినప్పుడు చూసిన వారు ఇప్పటికి కూడా ఆ సినిమా ఫెవరెట్ గానే చెప్పుకుంటారు.

    ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అప్పుడు ఎలా ఉన్నారో సినిమా చూసిన వారికే తెలుసు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారనేది చాలా మందికి తెలియక పోవచ్చు. చాలా మారిపోయారు. గుర్తుపట్టలేనంతగా ఎదిగిపోయారు. అప్పుడు చూసిన వారు కూడా కొందరు ఆర్టిస్టులను గుర్తుపట్టలేకపోవచ్చు. నమ్మలేనంతగా మారిపోయారు. ఆర్టిస్టు శ్రీను అలియాస్ అభిజిత్. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమాలో తన నటనతో మెప్పించారు. ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వాటిలో నటించిన అభిజిత్ కు బిగ్ బాస్ 4 లో నటించాడు. అందులో కూడా తనకు తానే సాటి అంటూ మెప్పించి ప్రశంసలు అందుకున్నారు.

    మరో నటుడు నాగరాజ్ అలియాస్ సుధాకర్ కొమాకుల. ఈ సినిమాలో సుధాకర్ స్నేహానికి విలువ ఇచ్చే పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించాడు. స్నేహానికి ఉన్న విలువలు, ఆ బంధం ఎలాంటిది, స్నేహితులు ఎలా ఉండాలి, వారి మధ్య తేడా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు సుధాకర్ నటనతో దర్శకుడు శేఖర్ చెప్పించాడు ప్రేక్షకులకు.

    అచ్చ తెలుగు అమ్మాయిలా మరో ఆర్టిస్టు నటించి మెప్పించింది. ఆమె లక్ష్మి అలియాస్ జరా షా. లంగా ఓని సంప్రదాయాన్ని పాటించింది. ఇది మన తెలుగు సంప్రదాయం అంటూ యువతులకు చెప్పే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు కూడా ప్రత్యేకత ఉంది. మరో హీరోయిన్ షాగున్ కౌర్. సినిమాలో పద్దు పేరుతో ప్రేక్షకులను ఆకట్టుకొంది. అభికి  మరదలుగా నటించింది. స్టయిల్ గా డ్రెస్సులు వేసుకొని అభిని ఆటపట్టిస్తూ నటించి మెప్పించింది.

    ఇంకో హీరో కౌశిక్ అలియాస్ అభి ఉన్నాడు. నటి శ్రీయకు సైట్ కొడుతూ ప్రేక్షకులను నవ్వించాడు. ఆ సినిమాలో చూసిన నటనకు తిరుగులేని విదంగా తయారవుతాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆయనకు అదే చివరి సినిమా. వీరందరితో పాటు విజయ దేవరకొండ, శ్రీయ, నవీన్ పోలిశెట్టి, అక్కినేని అమల, శ్రీ విష్ణు ఉన్నారు. వీరందరు కూడా సినిమా పరిశ్రమలో ఎంతో ఎదిగిపోయారు. నటనతో మెప్పిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naveen Polishetty : బడా ప్రొడ్యూసర్ తో నవీన్ పొలిశెట్టి టై అప్

    Naveen Polishetty : నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో తెలుగులో హీరోగా...

    Young Hero Making Hits : ఏ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా కుర్ర హీరో ఎలా హిట్లు కొడుతున్నాడబ్బా?

    Young Hero Making Hits : ఇటీవల కాలంలో చిన్న సినిమాలు...

    సమ్మర్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

    సాలిడ్ అందాల భామ అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత గ్రీన్...