
Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబోలో వచ్చిన ‘శివాజీ’ సినిమా గుర్తుంది కదా. అవినీతిపై పోరాటం చేసే ఎన్ఆర్ఐ కథతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ‘‘పువ్వల్లె నవ్వుల్ నవ్వుల్.. వాజీ వాజీ నా శివాజీ..’’ అనే సాంగ్ ఇప్పటికీ మనం మరిచిపోలేం. ఇందులో రజినీకి జోడిగా శ్రియ శరణ్ నటించింది. శివాజీ ది బాస్ అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ 2007లో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాను ఏవీఎం సంస్థ నిర్మించగా ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందించారు.
ఇందులో రజినీకి దీటైన విలన్ పాత్రలో అందాల నటుడు సుమన్ నటించడం విశేషం. రజినీ కంటే అందంగా కనపడొద్దని సుమన్ కు ఎత్తు పండ్లు పెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ స్టైల్, మాస్ ఎలిమెంట్స్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, కామెడీ వేరే లెవల్ లో ఉంటుంది. ఒక్క మాస్ మాటలో చెప్పాలంటే రజినీ మార్క్ మాస్ ఎంటర్ టైనర్, శంకర్ మార్క్ మెసేజ్ ఒరియంటేడ్ మూవీ అనుకోవాలి. అప్పట్లోనే 100 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.
ఇక ఈ సినిమాలో శ్రియను లవ్ లో పడేసేందుకు రజినీ చేసే కామెడీ సీన్స్ హైలెట్. రజినీకి మామ పాత్రలో ప్రముఖ హాస్యనటుడు దివంగత వివేక్ నటించి కడుపుబ్బా నవ్వించాడు. శ్రియను లవ్ లో పడేసేందుకు ఆమె ఇంటి ముందున్న కవల అమ్మాయిలకు ప్రపోజ్ చేయడం లాంటి సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడెలా ఉన్నారో చూస్తూ షాక్ అవుతారు. అక్కమ్మ, జక్కమ్మ పాత్రల్లో నటించిన ఆ ఇద్దరు అమ్మాయిలను ఎప్పటికీ మరిచిపోలేం. మాతో పరిచయం పెంచుకోండి అంటూ వాళ్ల నాన్న పదే పదే చెప్పే డైలాగ్ లు భలే ఉంటాయి. అయితే ఆ సినిమా చూస్తున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు బయట కూడా ఇలాగే ఉంటారా? అనే అనుమానం అందరిలో కలిగింది.
అయితే వీరు బయట చాలా అందంగా ఉంటారు. వారి అసలు పేర్లు ‘అంగవై’, ‘సంగవై’. వీరిని సినిమా కోసం డీగ్లామర్ గా చూపించారు. 13 ఏండ్ల కింద వచ్చిన సినిమాలో వీరు చిన్న వాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లు మరింత అందంగా తయారయ్యారు. వీరి ప్రస్తుత ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. శివాజీ తర్వాత వీరు మరే సినిమాలో నటించలేదు.