30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Kalki 2898 AD : ఆ ముగ్గురిదే సినిమా అంతా..

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD

    Kalki 2898 AD : బాహుబలి సిరీస్ తర్వాత  హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.  బాహుబలి తర్వాత సాహో సౌత్ లో యావరేజ్ గా నిలిచినా, నార్త్ లో ప్రభాస్ స్టైల్, మేనరిజమ్స్ కి మంచి మార్కులే పడ్దాయి. ఈ సినిమా సౌత్ లో కన్నా నార్త్ లోనే ఎక్కవ  కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్  సినిమాలకు ఓపెనింగ్స్ బ్రహ్మండగా ఉన్న ప్రభాస్ మార్క్ హిట్టు కొట్టలేకపోయాయి. ఇక గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన సలార్ సంచలన విజయం సాధించింది.   మరోసారి ప్రభాస్ స్టామిని ఏంటో నిరూపించింది. ఆ సినిమా అంతా వన్ మాన్ షో గా నిలిచింది. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ సినిమాను హై రేంజ్ కు తీసుకెళ్లాయి.

    ఎన్నో అంచనాలతో కల్కి సినిమాతో మరోసారి భారీ లెక్షన్లు కొల్లగొట్టడానికి ప్రేక్షకుల ముందుకు ప్రభాస్. అయితే ఇండియాలో సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందే ఈ మూవీ ప్రీమియర్స్ యుఎస్ఏ లో వేశారు.  అయితే ఈ సినిమా అభిమానుల అలరించిందా? లేదా?తాము అనుకున్న రోల్ లో ప్రభాస్ కనిపించాడా? వాళ్లు అనుకున్నట్లుగా సినిమా ఉందా లేదా? వాళ్లేమనుకుంటున్నారో తెలుసుకుందాం.

    ఇదీ కథ..

    మహాభారతంలోని పాత్రలను  ఊహించుకొని నాగ్ అశ్విన్ ఈ కథ సిద్ధం చేశాడు. పురాణాల్లో శ్రీమహావిష్ణువు చెప్పిన ప్రకారం ఎప్పుడైతే కలియుగంలో అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు విలయ తాండవం చేస్తాయో అప్పుడు కల్కి అవతారంలో శ్రీమహావిష్ణువు అవతరించి, దుష్ఠులందరిని అంతం చేస్తాడని పురాణాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా కలి రోల్ చేసిన కమలహాసన్ సృష్టి వినాశానాన్ని కోరుతాడు. కలి విపత్తులను భైరవ (ప్రభాస్), కల్కి ఇద్దరూ కలిసి ఎలా అడ్డుకున్నారనేదే ఈ సినిమా కథ అని చెబుతున్నారు. అయితే ఈ స్టోరీతో నాగ్ అశ్విన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని, ఈ సినిమా చూసిన ప్రతి అభిమాని కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందంటున్నారు.

    ఇక ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే ప్రధాన బలం. ప్రతి 15 నిమిషాలకోసారి ఈ సినిమాలో హై ఎమోషన్ ను ఇచ్చి వదిలారని ప్రభాస్ అభిమానులు కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు.  ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ బాగా హ్యాండిల్ చేశాడని, ప్రీ ప్రొడక్షన్ దశలోనే సినిమాను తన ఊహాలకు తగ్గట్లుగా ప్రిపేర్ అయ్యాడని అభిమానులు చెబుతున్నారు.   600 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి ఫ్రేమ్ లో  కనిపిస్తుందంటున్నారు.

    ప్రభాస్, అమితాబచ్చన్, దీపిక పదుకునే తమలోని టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నారని చెబుతున్నారు. ఇక దీపిక పదుకొనే ఇప్పటి దాకా చేయని డిఫరెంట్ రోల్ చేసి మెప్పిస్తున్నదని చెబుతున్నారు. ఒక ఎమోషనల్ డ్రామా తో కూడిన పాత్ర  ఆమె  కెరీర్ లోనే ది బెస్ట్ అని పేర్కొంటున్నారు. ఇక ప్రభాస్ తనదైన కామెడీ పండిస్తూనే, యాక్షన్ సీన్స్ లో మాత్రం తనకు మరెవరూ పోటీలేరు అని మరోసారి చూపించాడని చెబుతున్నారు.

    బిగ్ బీ అమితాబ్, కమలహాసన్ ఈ సినిమాని వాళ్ల భుజాల మీద మోశారు. ఒకవైపు ప్రభాస్ ,  మరో వైపు బిగ్ బీ, కమల్ సినిమా ను మరో రేంజ్ కు తీసుకెళ్లారని చెబుతున్నారు.   ఇక సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కూడా సినిమాలకు ప్లస్ అంటున్నారు. సినిమాలోని కోర్ ఎమోషన్ ని ఎలివేట్ చేయడంలో బీజీఎం అద్భుతమని అంటున్నారు. అమెరికా లో మంచి టాక్ తో రన్ అవుతున్న కల్కి ఇక్కడ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందనేది మరో కొద్ది గంటల్లో వెల్లడికానుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్…! సీఎం నుంచి స్పష్టమైన హామీ..

    Kamal Haasan : దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని,...

    Deepika delivery date: దీపికా పదుకొనె డెలివరీ డేట్ ఇదే.. కన్ఫమ్ చేసిన వైద్యులు.. ఎప్పుడంటే?

    Deepika delivery date: దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది....

    Kalki : కల్కి నుంచి మరో అప్ డేట్.. స్ట్రీమింగ్ డేట్ లాక్

    Kalki : ఇండియన్ సినిమా కీర్తిని ప్రపంచానికి చెప్పింది కల్కి 2898ఏడీ....