మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో BRS పార్టీలో చేరనున్నారు. ఇక ఆ మరుక్షణమే ఏపీ BRS రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గా తోటను నియమించనున్నట్లు తెలుస్తోంది. BRS అధ్యక్షుడు కేసీఆర్ తన పార్టీని దేశ వ్యాప్తంగా బలోపేతం చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అందులో భాగంగానే ఏపీపై దృష్టి పెట్టాడు. తోట చంద్రశేఖర్ కు ఐఏఎస్ ఆఫీసర్ గా చాలా మంచి పేరుంది. దాంతో ఏపీలో BRS కు ఓట్లు పడటం ఖాయమని భావిస్తున్నాడు కేసీఆర్.
తోట చంద్రశేఖర్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. ఆ పార్టీ నుండి లోక్ సభకు పోటీ చేసాడు కూడా. అయితే అప్పట్లో ఓటమి చవిచూసాడు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. కట్ చేస్తే జనసేనలో కూడా చేరాడు. పవన్ కళ్యాణ్ కు అండగా ఉండాలని అనుకున్నాడు. కానీ కేసీఆర్ నుండి పిలుపు రావడంతో భారత్ రాష్ట్ర సమితిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. రేపు హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నాడు. ఏపీ BRS పగ్గాలు చేపట్టనున్నాడు.