
Cartoon BJP vs Hindu : భారతీయ జనతా పార్టీ ఈ పేరు చెబితే చాలు ఎవరికైనా అది ఫక్తు హిందూ పార్టీ అని తెలుస్తుంది. హిందూ భావజాలం నరనరాన జీర్ణించుకున్న పార్టీ ఇది. పార్టీ ఆర్ఎస్ఎస్ లోని ఒక శాఖగా ఆవిర్భవించిందని అందరికీ తెలిసిందే. అఖండ భారతావనే లక్ష్యంగా పోరాడుతామని, హిందువులను ఏకతాటిపైకి తెస్తామని పార్టీ అగ్రనాయకత్వం ఎప్పుడూ చెప్తుంటుంది. హిందూ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న పార్టీగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే హిందువులను ఏకతాటిపైకి తేవడంతో ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉత్తరభారతం మాట అటుంచితే దక్షిణ భారతంలో బీజేపీకి అస్సలు పట్టు దొరకడం లేదు. అక్కడి ప్రాంతం ఎక్కువ కాలం నిజాం పాలనలో ఉన్నందున హిందువులు భయంలోనే బతికేవారు. మావోయిస్టు ఉద్యమం కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ కాలం కొనసాగింది. ఉత్తరాది కంటే దక్షిణాదిలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువ. గతంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్లు మావోయిస్టులకు మద్దతుగా నిలిచేవారు. భారీ ఎత్తున యువత ఆ ఉద్యమం వైపు ఆకర్షితమయ్యేది.
ఇవన్నీ పక్కనబెడితే హిందూ ఓటర్లే ఎప్పుడూ బీజేపీని ముంచుతున్నారని ఒక కార్టూన్ ఇటీవల వెలువడింది. దీనికి సింబల్ గా కార్టూన్ లో ‘బీజేపీ’ అనే వ్యక్తిని ‘హిందూ’ అనే వ్యక్తి కాలితో తన్నినట్లు చూపించారు. ఈ కార్టూన్ ఇప్పుడు హిందువులను ఆలోచింప జేస్తుంది. నరేంద్ర మోడీ ప్రధానిగా పీఠం అదిష్టించినప్పటి నుంచి దేశం కీర్తి ప్రపంచంలో వెలిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలానే కొనసాగాలంటే తమ పార్టీ అధికారంలోనే ఉండాలి.
ఇందుకు చేసిన అభివృద్ధి చూపుతూ.. హిందూ ఎజెండా కొనసాగిస్తూ వస్తుంది బీజేపీ. నిజానికి హిందూ ఎజెండా పార్టీకి ఉన్నా నరేంద్ర మోడీ మాత్రం ప్రతీ ఒక్కరినీ సమదృష్టితో చూసేవారి. ఆర్టికల్ 370 తొలగించినా అక్కడ ఒక్క అల్లరి కూడా చెలరేగలేదంటే అది నరేంద్రుడి పాలనకు సంకేతంగా అనుకోవచ్చు. త్రిపుల్ తాలాక్ ను కూడా తీసేయడంతో ముస్లిం యువతులకు మంచి జరిగిందని వారే బహిర్గతంగా చెప్తున్నారు.
ఇటీవల కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఇది అందరూ ఊహించేందే కానీ ఇంతలా ఓటమి పాలవడం వెనుక హిందూ సమాజమే మొదటి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో ఎంఐఎం ఏర్పడిన నాటి నుంచి హిందువులు దానికి ఓటేసిన సందర్భాలు ఉన్నా.. ముస్లింలు మాత్రం బీజేపీకి ఓటేసిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. ఇక ఉమ్మడిగా ఉంటూ ముస్లిం ఓటర్ల కోసం పని చేసే మరో పార్టీ కాంగ్రెస్. హిందువులకు కాంగ్రెస్ వ్యతిరేకం కాకపోయినా వారి కోసం ఎదురు నిలిచేంత సాహసం మాత్రం ఎనాడూ చేయదని అందరికీ తెలిసిందే.
అయినా కాంగ్రెస్ ను హిందువులు ఆదరించడంపై పలు అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క హిందువుల కోసం పని చేసే పార్టీ బీజేపీ అని తెలిసినా ఎందుకు హిందువులు బీజేపీని వీడుతున్నారన్నది ఎప్పటికీ జవాబు లేని ప్రశ్నగానే మిగులుతుంది.