Mahesh Babu :
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అందరికి ఆసక్తి కలిగిస్తోంది. దాదాపు రూ.1500 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. ఇంకా ఇందులో ముగ్గురు బాలీవుడ్ హీరోలు నటిస్తారని చెబుతున్నారు. వారెవరు అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సినిమా గురించి కసరత్తు జరుగుతోంది. రాజమౌళి ఈ మేరకు షెడ్యూళ్లు ఖరారు చేస్తున్నారు.
రాజమౌళి సినిమా అంటేనే అందరికి ఆతృత ఉండటం సహజమే. ఈ నేపథ్యంలో బడ్జెట్ పరంగా కాస్టింగ్ పరంగా ఆర్ఆర్ఆర్ మూవీని మించిపోయే అవకాశం ఉందట. స్ర్కిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. రచయిత విజయేంద్ర ప్రసాద్ కథలో క్లైమాక్స్ ఇంకా రాలేదని తేల్చేశారు. మొత్తానికి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి అర్థం కావడం లేదు.
మహేష్ బాబు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నాడు. సినిమాలో గుడ్ లుకింగ్ కోసం ఎక్సర్ సైజులు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్ కూడా విడుదల చేశారు. రాజమౌళి సినిమా గురించి బాగానే అంచనాలు పెరుగుతున్నాయి. ఇద్దరు అగ్రగణ్యులు కావడంతో సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై అందరు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మహేష్ బాబు పాత్ర ప్రపంచాన్ని చుట్టే ఓయాత్రికుడిగా చూపించనున్నారట. షూటింగ్ మొత్తం అమెజాన్ అడవుల్లో చిత్రీకరణకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. మహేష్ బాబు సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో ఎంతో యాంగ్జయిటీ ఏర్పడుతోంది. సినిమా పరంగా రాజమౌళి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు. విడుదల వరకు పరిస్థితుల్లో ఏం మార్పులు వస్తాయో అని చూస్తున్నారు.