
Rain alert : AP: ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు, ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. కాగా అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో వర్షం కురుస్తోంది.