Students Missing : ముగ్గురు 9వ తరగతి చదువు తున్న హై స్కూల్ విద్యార్థులు మిస్సింగ్ అయిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరి పల్లి లో చోటుచేసు కుంది. ఆగిరి పల్లి మండలం సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
ఉదయం స్కూల్ కి వెళ్లి విద్యార్థులు తిరిగి రాకపో వడంతో తల్లి దండ్రులు స్కూల్లో ఉపాధ్యాయిని విచారించారు. ముగ్గురు విద్యార్థునులు పాఠశా లకు రాలేదని ఉపాధ్యాయుడు చెప్పడంతో తల్లి, దండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ముగ్గురు మైనర్ విద్యార్థునులు కావడం వారితో ఓ విద్యార్థి కొంత నగదును కూడా తీసుకొని నట్లు సమాచారం అందుతుంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బం ధాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం కాలు స్తున్నట్లు పోలీసులు తెలిపారు.