
Weather Forecast : ఈ నెలలో మూడు అల్ప పీడనాలు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. జులై 7న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 8న ఉత్తరాంధ్ర, ఉత్తర ఒరిస్సా మధ్య తీరం దాటుతుందని పేర్కొంది. దీని వలన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జిల్లాల్లో 7, 8, 9, 10, 11, 12 తేదీలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జులై 15న వాయువ్య బంగాళాఖాతంలో మరొక తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉత్తర ఒరిస్సా మధ్య తీరం దాటుతుందని, దీని ప్రభావంతో 15, 16, 17, 18 తేదీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అలాగే ఈ నెల 23న తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 25 లేదా 26 (సుమారుగా)న వాయుగుండంగా బలపడి మధ్యాంద్ర వైపుగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.