36.5 C
India
Friday, April 10, 2026
More

    వామ్మో పులి.. వైరల్ అవుతున్న వీడియో..!

    Date:

    tiger
    tiger

    పులిని చూస్తే ప్రాణాలు పైనే పోతాయి. అది గాండ్రిస్తే అంతే సంగతి. మనకు బతుకు మీద ఆశ ఉండదు. క్రూర జంతువుల్లో పులి ముఖ్యమైనది. దీంతో దానికి ఎదురుపడితే ఏమైనా ఉందా? మనకు భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే అనుకుంటాం. అంతటి భయంకరమైన పులిని దగ్గరగా చూస్తే ఇంకేమైనా ఉందా? మన బతుకు తెల్లారినట్లే అనుకుంటాం. ఇలాంటి సంఘటన ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా నిలుస్తోంది. పులి గాండ్రింపు ప్రత్యక్షంగా చూసి ఆందోళనకు గురయ్యారు.

    ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద సందర్శకులకు వింత అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా పులి వచ్చింది. దీంతో వారు హడలిపోయారు. అది ఒక్కసారిగా వారి వాహనంపై దూకి గాండ్రించింది. దీంతో వారి ప్రాణాలు పైపైనే పోయాయి. వెంటనే డ్రైవర్ ను వాహనం రివర్స్ తీసుకోమని చెప్పే మాటలు ఆ వీడియోలో వినిపిస్తున్నాయి.

    చావును దగ్గరగా చూసినట్లు అనిపించింది. పులి అకస్మాత్తుగా ప్రత్యక్షమవడంతో వారు భయంతో కేకలు వేశారు. పులికి తాము ఆహారం అవుతామని బెంగ వారిలో కనిపించింది. మొత్తానికి పులి వారిని భలే భయపెట్టింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. పులి నోట్లో తల పెట్టినట్లుగా ఉందని వారు భయంతో మాట్లాడుకోవడం కనిపించింది.

    మరో ఘటనలో ఓ గ్రామంలో పులి ఆవు, దూడలను తరుముతూ కనిపించింది. దీంతో అవి చెల్లాచెదురుగా పారిపోయాయి. కానీ ఓ దూడ వెంబడి పులి పడటంతో ఆవు దాన్ని రక్షించేందుకు పులిని తరిమిన ఘటన కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలను ఫారెస్ట్ అధికారి ట్వీట్ చేశారు. దీనికి భలే లైకులు, కామెంట్లు వస్తున్నాయి. పులి బాగోతంపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : కుటుంబంతో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

    Nara Lokesh : అమృత్‌సర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్...

    Viral video : కదిలిస్తున్న ఏపీ పోలీసుల వీడియో : స్ఫూర్తిదాయక సందేశం!

    Viral video : ఆంధ్రప్రదేశ్ పోలీసులు రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం...

    Viral video : బాత్రూం లాంటి గది.. బెంగళూరులో 25వేలు.. ఈ యువకుడి వీడియో వైరల్

    Viral video : బెంగళూరులో నివాస ఖర్చులు ఎంతగానో పెరిగిపోయాయి, అద్దె లేదా...

    Viral Video : లిఫ్ట్ లో బ్యాటరీలు తీసుకెళుతున్నారా తస్మాత్ జాగ్రత్త.. ఈ వీడియో చూడండి

    Viral Video: ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు కాలిపోవడం, పేలిపోవడం...