19.5 C
India
Sunday, January 18, 2026
More

    Tilak Varma Indian cricketer : కోచ్ ప్రోత్సాహం.. తండ్రి సహకారం అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్న తిలక్ వర్మ

    Date:

    Tilak Varma Indian cricketer
    Tilak Varma Indian cricketer
    Tilak Varma Indian cricketer : వెస్టిండీస్  టూర్ లో టీ20 సిరీస్ లో  రాణిస్తు్న్న తెలుగుతేజం తిలక్ వర్మ. ఐపీఎల్ 16 వ సీజన్ లో ప్రతిభ చూపి టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. టీమిండియాకు  మరో అద్బుత క్రికెట్ దొరికాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. తన 11వ ఏటనే భారత జట్టుతో ప్రయాణాన్ని సాగిస్తున్నాడు.  సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తిలక్ ఇటు దేశవాళీ క్రికెట్ లోనూ, ప్రస్తుతం వెస్టిండీస్ టూర్ లోనూ  సత్తా చాటుతున్నాడు. టీమిండియా భవిష్యత్ కు ఆశా కిరణంలా నిలుస్తున్నాడు.
    కోచ్ ప్రోత్సాహంతో..
     హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ తండ్రి నంబూరి నాగరాజు ఎలక్ర్టీషియన్. మధ్య తరగతి కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. తిలక్ కు ఊహ తెలిసినప్పటి నుంచి బ్యాట్ బాల్ తో సరదాగా ఆడుకునేవాడు. ఆ సమయంలో కొడుకు తండ్రి నాగరాజు ఓ ప్లాస్టిక్ బ్యాట్ కొనిచ్చాడు. దీంతో ఎప్పుడూ బ్యాట్ తనవెంటే ఉంచుకునేవాడు. రాత్రి నిద్రపోయే సమయంలోనూ బ్యాట్ తన పక్కనే పెట్టుకునే వాడు.
    అది కాస్త క్రికెట్ తో వీడదీయలేని ఇష్టానికి దారి తీసింది. ముందుగా తండ్రి తమ ఆర్థిక పరిస్థితులు, కొడుకు భవిష్యత్ దృష్ట్యా వారించినా ఇష్టాన్ని చూసి కాదనలేకపోయాడు. అదే సమయంలో బార్కాస్ మైదానంలో క్రికెట్ కోచ్ సలామ్ బయాష్ తిలక్ లోని టాలెంట్ ని గుర్తించాడు. కోచ్ తిలక్ వర్మ తండ్రికి ఫోన్ చేసి అకాడమీలో చేర్పించమని సూచించాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ముందు కాదన్నాడు. అయితే కోచ్ స్వయంగా శిక్షణకు వెంట తీసుకెళ్తానని చెప్పడంతో తిలక్ వర్మ తండ్రి అంగీకరించాడు. ఇక అప్పటి నుంచి తండ్రి అడ్డు చెప్పలేదు. కోచ్ ప్రోత్సాహంతో ఆటలో వెనుదిరిగి చూడలేదు. తిలక్ వర్మ శిక్షణ పొందిన క్రికెట్ అకాడమీ హైదరాబాద్ లోని లింగంపల్లి ఉంది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేడియానికి కోచ్ బయాష్ తన బైక్ పై స్వయంగా తీసుకెళ్లాడు. కోచ్ సలామ్ బయాష్ లేకుంటే తన కొడుకు ఈ స్థాయిలో ఉండేవాడు కాదని తండ్రి నాగరాజు చెబుతున్నాడు.
    దేశవాళీలో క్రికెట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన తిల‌క్ ఐపీఎల్ ఫ్రాంచైజీల‌ దృష్టిని తన వైపునకు తిప్పుకునేలా చేశాడు. గత ఏడాది మినీ వేలంలో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians)  తిలక్ వర్మను రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజ‌న్‌లో అద‌రగొట్టిన తిల‌క్ 16వ సీజ‌న్‌లో మ‌రింత చెల‌రేగాడు. 11 మ్యాచ్ లలో  343 పరుగులు సాధించాడు. దీవతో, బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో దృష్టిలో ప‌డ్డాడు. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక‌య్యాడు. నాలుగో స్థానంలో వ‌చ్చిన‌ తిల‌క్ అరంగేట్రం మ్యాచ్‌లోనే 39 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచ‌రీతో అదరగొట్టాడు. అయితే.. ఆతిథ్య జ‌ట్టు 153 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిరీస్‌లో నిల‌వాలంటే త‌ప్పక గెల‌వాల్సిన మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ కీల‌క ఇన్నింగ్స్ ఆడతాడా? లేదా? అనేది చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kamindu Mendis : మ్యాచ్ కోసం హనీమూన్ క్యాన్సిల్ చేసిన కమిందు మెండిస్

    Kamindu Mendis : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భావోద్వేగాలూ,...

    Zaheer Khan : జహీర్ ఖాన్ , ఓ లేడి అభిమాని 20 ఏళ్ల తరువాత పునఃకలయిక.. వీడియో వైరల్

    Zaheer Khan Lady Fan : లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్...

    Dhoni : ధోని చెప్పిన ఓ గొప్ప మాట

    Dhoni : తన ప్రవర్తన ద్వారా మంచి మనిషిగా ఇతరులు గుర్తించుకోవాలని కోరుకుంటున్నట్లు...