‘Tillu Square’ :
‘డిజే టిల్లు’… ఈ పేరు తెలియని యువత లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం లోని పాటలు పెళ్ళి ఊరేగింపు లో, ఫంక్షన్లలో దాదాపు అందరికి సుపరిచితమే. ఇక ఈ మూవీ లో హీరో సిద్ధు నటన ఎంతలా అలరించిందో మనందరికి తెలిసిందే.
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘టిల్లు స్క్వేర్’ అనే క్రేజీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.
15 సెప్టెంబర్ 2023న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా మళ్లీ వాయిదా పడనుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘రామ్ పోతినేని’ నటించిన ‘స్కంద’ అనే చిత్రం, ‘చంద్రముఖి 2’, ‘మార్క్ ఆంటోనీ’ అనే రెండు డబ్బింగ్ చిత్రాల విడుదల ఉన్నందున బాక్సాఫీస్ వద్ద క్లాష్ కాకుండా ఉండాలని మేకర్స్ భావిస్తున్నట్లు వినికిడి.
అక్టోబర్ 6, 2023న టిల్లు స్క్వేర్ కొత్త రిలీజ్ డేట్ గా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ఎవరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో రిలీజ్ డేట్ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
సరదాగా సాగే ఈ థ్రిల్లర్ లో బబ్లీ నటి ‘అనుపమ’ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రామ్ మిరియాల’ సంగీతం అందిస్తున్నారు.






