Bhola Shankar :
మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకొని ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇప్పుడు మెగాస్టార్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. ఈ వయసులో కూడా ఏ మాత్రం గ్రేస్ తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. మరి సినిమాలు చేయడమే కాకుండా విజయం కూడా అందుకుంటున్నాడు.
ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగాస్టార్ ఫుల్ జోష్ లోకి వచ్చాడు.. ఇప్పుడు మెగాస్టార్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నాడు.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ దాదాపు చివరి దశకు చేరుకుంది.. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మరి ఆ అంచనాలను డబల్ చేసేందుకు మెగాస్టార్ అండ్ టీమ్ రేపు మరో సరికొత్త అప్డేట్ తో రాబోతున్నారు. భోళా శంకర్ టీజర్ ను రేపు జూన్ 24న సాయంత్రం 4 గంటల నుండి హైదరాబాద్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు అఫిషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తుంది.. ఇక మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.. మరి మెగాస్టార్ భోళా నుండి రాబోతున్న టీజర్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికాస్త సమయం వేచి ఉండాల్సిందే..