Belly Fat: మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్. రెండోది చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ మనకు ఎక్కువ ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. ఒకవేళ తేడా వస్తే మన రక్తనాళాలకు ఇబ్బందులొస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను హెచ్ డీఎల్, చెడు కొలెస్ట్రాల్ ను ఎల్ డీఎల్ అని పిలుస్తుంటారు. ఎల్ డీఎల్ పెరిగితే అధిక బరువు, హైపర్ టెన్షన్, గుండె పోటు, స్ట్రోక్, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, కిడ్నీ జబ్బులు వంటివి బాధిస్తాయి.
చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా వ్యాయామం చేయాలి. ఫుడ్ కంట్రోల్ గా తింటే మనకు నష్టాలు ఉండవు. అధిక బరువు సమస్య ఉండదు. కొలెస్ట్రాల్ మైనం లాంటి పదార్థం. కొలెస్ట్రాల్ మన శరీరంలో సెల్ మెంట్రిన్, హార్మోన్లు, విటమిన్ డి తయారు కావడానికి తోడ్పడుతుంది. ఆయుర్వేదంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి తగ్గించడానికి కొన్ని కిటుకులున్నాయి.
కొలెస్ట్రాల్ ను కరిగించడానికి గుగ్గులు ఉపయోగిస్తారు. ఈ మొక్కలో గుగ్గుల్ స్టిరోన్ అనే సమ్మేళనం ఉండటం వల్ల ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావడానికి సాయపడుతుంది. అర్జున బెరడులో ఉండే ఫ్లేవనాయిడ్స్ అర్జునోనిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
అర్జున బెరడును పాలలో మరిగించి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ అతిగా తాగకూడదు. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి మెంతులు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. మెంతులలో సోపోనిన్సు రక్తంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. రాత్రిపూట నీళ్లలో మెంతులు నానబెట్టి మరునాడు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి జరుగుతుంది. ఇలా కొవ్వును దూరం చేసుకునే మార్గాలు అనేకం ఉన్నాయి.