TNLive Owner MudduKrishna Kilaru ప్రముఖ జర్నలిస్ట్, టీఎన్ లైవ్ యజమాని ముద్దు కృష్ణ కిలారు ఇక లేరు. ఆయన గుండెపోటుతో ఈ సాయంత్రం విజయవాడ దగ్గరలోని తిరువురులో కన్నుమూశారు. ఆయన మృతికి ఏపీ జర్నలిస్టులు, నాయకులు సంతాపం తెలిపారు.
ముద్దుకృష్ణ కిలారు ప్రముఖ పాత్రికేయుడిగా.. నిజాలు నిక్కచ్చిగా రాస్తూ జర్నలిజంలో మంచి గుర్తింపు తెచ్చుకొని..టీఎన్ లైవ్. కామ్ పేరిట ఆయన ప్రచురించిన కథనాలకు టీడీపీ, వైసీపీ షేక్ అయ్యేవి. ఒక్కో వార్త తూటాల్లా పేలేది. ముఖ్యంగా విజయవాడ, తిరువూరు రాజకీయాలపై ముద్దుకృష్ణ రాసిన కథనాలు ప్రభుత్వాన్ని కదిలించాయి.
కొన్నేళ్లుగా తన వార్తలు, కథనాలతో ప్రభుత్వాలను షేక్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ గుండెపోటుతో ఈరోజు సాయంత్రం కన్నుమూయడం విషాదం నింపింది.
‘తెలుగు న్యూస్ ఇంటర్నేషనల్’ ‘టీఎన్ఐ లైవ్ న్యూస్ పేరిట అంతర్జాతీయ తెలుగు వార్త వేదికను ఏర్పాటు చేసిన కిలారు ముద్దుకృష్ణ ప్రవాస తెలుగువారికి తమ గళం వినిపించేలా చేశారు. ఆయన మృతికి ప్రముఖులు ‘జై యలమంచిలి’ గారు సంతాపం తెలిపారు. ఇక ముద్దుకృష్ణ మృతికి జర్నలిస్టులు, ప్రముఖులు, పాత్రికేయులు రాజకీయ నాయకలు తమ ప్రభాగ సానుభూతి తెలిపారు.
సిలికాన్ ఆంధ్ర కుటుంబం ఒక గొప్ప మిత్రుడు , శ్రేయోభిలాషి ముద్దు కృష్ణ కిలారు గారిని కోల్పోయింది. తక్షణమే అందరితో కనెక్ట్ అయ్యే అద్భుతమైన వ్యక్తి. మా కుటుంబంతో చాలా వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యారు. అని ఎన్నారైలు ఆయనకు నివాళులర్పించారు.