21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Damage KCR : కేసీఆర్ ను డ్యామేజ్ చేయడానికేనా..? 

    Date:

    damage KCR
    damage KCR

    Damage KCR : ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగు చూసినప్పటి నుంచి రోజుకో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ స్కాంలో బడా నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సీఎం జగన్ అనుయాయులతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతరు కల్వకుంట్ల కవితకు సీబీఐ, ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసి విచారణ జరపిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఆర్ లోనూ కవిత పేరు చేర్చారు. అయితే ఈ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ పేర్కొంటున్న నిందితులు అప్రూవర్ గా మారడం వెనుక రాజకీయ కోణాలు దాగి ఉన్నట్లు అనుమానాుల వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కాంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

     శరత్ చంద్రారెడ్డి బడా పారిశ్రామిక వేత్త. ఏపీ  సీఎం జగన్ బినామీల్లో ఒకరనే ప్రచారం ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరబిందో రియాల్టీకి పోర్టులు, సెజ్‌లు దక్కాయి. పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవహారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో విక్రయించే సగానికి పైగా మద్యం శరత్ చంద్రారెడ్డి కంపెనీల్లోనే తయారవుతుందని తెలుస్తున్నది. అయితే అతను అప్రూవర్ గా మారడం వెనుక జగన్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాతే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ మారడం ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారనే పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తున్నది. అయితే కేసీఆర్ కూతురు కవితను వదిలేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలా వదిలేస్తే కేసు బలహీనపడిపోతుంది.

    ఈ స్కామ్‌లో లంచాలు, పెట్టుబడులు, ఆదాయం భూములు అన్నీ కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. ఇందులో కవిత మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయ్యారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో కవిత తరపున వీరిద్దరే వ్యవహారాలు చక్కబెట్టారని సీబీఐ పేర్కొంది. ఇప్పటికే సీబీఐ,ఈడీ వేసిన చార్జీషీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు. నిందితులు అప్రూవర్లుగా మారితే స్కాం జరగలేదని వాదించే అవకాశం ఉండదు. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారికి చిక్కుల్లో పడక తప్పదని తెలుస్తున్నది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అవడం ద్వారా కవితను టార్గెట్ చేసేందుకేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    అయితే ఈ కేసులో కవిత జైలుకు వెళితే ఎవరికీ ప్రయోజనం. తెలంగాణ సీఎం కేసీఆర్ ను డ్యామేజ్ చేయడానికేనా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కవిత  జైలుకు వెళితే కేసీఆర్ జగన్ ను ఉపేక్షిస్తాడా  అన్నది ఇక్కడ కీలక ప్రశ్న. జగన్ విజయంలో కేసీఆర్ పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్

    Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలన...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం...

    Delhi Liquor Scam : ఆమె లీలలు అసాధారణం.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ వాదనలు

    Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...