
Shani doshalu : శని దోషం ఉంటే ఏ పని కాదు. ఏదీ ముందుకు పోదు. అన్నింట్లో ఆటంకాలే ఎదురవుతాయి. దీంతో శనీశ్వరుడిని పూజించాలి. అది శనివారమే చేయాలి. శనివారం నల్ల నువ్వులతో శనికి ప్రార్థిస్తే మనకు పట్టిన శని దోషం పోతుందని పురాణాలు చెబుతున్నాయి. శని దోషం పోవడానికి అల్లనేరేడు పండును నైవేద్యంగా పెడితే మంచి ప్రయోజనం కలుగుతుందని చెబుతుంటారు. ఇలా శనిని ప్రసన్నం చేసుకునేందుకు అందరు చొరవ చూపుతుంటారు.
నేరేడు పండ్లను శనిదేవుడికి నైవేద్యంగా పెడితే నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు లేకుండా పోతాయి. శనీశ్వరుడికి నేరేడు పండు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకు ప్రసాదంగా పెట్టడం వల్ల మనకు శని దోషాలు తొలగిపోతాయి. జీవితంలో శని బాధలు ఉండవు. శనికి నైవేద్యం పెట్టి పూజించిన పండ్లను బిచ్చగాళ్లకు దానం ఇవ్వడం వల్ల కూడా దరిద్రం లేకుండా పోతుంది.
పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూలంతో పాటు ఇస్తే భూదానం చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. ఇలా నేరేడు పండు మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. రోజుకో నేరేడు పండు తింటే రోగాల నుంచి బయట పడొచ్చు. ఎవరికైనా భోజనం పెట్టినప్పుడు నేరేడు పండును కూడా వడ్డిస్తే ఇక మనకు జీవితంలో ఎప్పటికి భోజనం లభిస్తుందని నమ్ముతుంటారు.
శని దుష్ర్పభావాలు మన మీద పడకుండా ఉండాలంటే నువ్వుల నూనె కానీ ఆముదంతో కానీ శనిని పూజిస్తే మంచిది. పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని పెట్టి నేరేడు పండును నైవేద్యంగా పెడితే మచి జరుగుతుంది. శని దోష నివారణకు నేరేడు పండు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా మనం నేరేడు పండుతో శనిని పూజించడం వల్ల పలు రకాల మేలు కలుగుతుంది.