horoscope today మేష రాశి వారికి తగాదాలు ఏర్పడే సూచనలున్నాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. రుణప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో సహకారాలు అంతగా లభించవు.
వృషభ రాశి వారికి రుణాలు చేస్తారు. స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మిథున రాశి వారికి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మనోల్లాసం కలుగుతుంది. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది.
కర్కాటక రాశి వారికి బంధు మిత్రులతో వైరం ఏర్పడే అవకాశముంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. చెడు సహవాసాలకు స్వస్తి పలకాలి.
సింహ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులొస్తాయి. ప్రయాణాలు చేస్తారు. సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
కన్య రాశి వారికి అనారోగ్యాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. ధననష్టం కలిగే సూచనలున్నాయి. విరోధులు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
తుల రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శత్రువులు పెరుగుతారు. ఒక వార్త ఇబ్బంది కలిగిస్తుంది. పిల్లల విషయంలో మొండిపట్టుదల వద్దు.
వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభ వార్తలు వింటారు. మనోధైర్యం పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు.
ధనస్సు రాశి వారికి కళల్లో ఆసక్తి పెరుగుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. నూతన వస్తు, ధన, వస్త్ర లాభం కలుగుతుంది.
మకర రాశి వారికి కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు.
కుంభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి పరిస్థితులు ఉన్నాయి. మానసిక ఆందోళనలు కలిగే అవకాశముంది.
మీన రాశి వారికి భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలున్నాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయుల సహకారం ఉంటుంది