Today Horoscops : మేష రాశి వారికి పనుల్లో పురోగతి కావాలంటే శ్రమ అవసరం. వ్యవహారాల్లో ఆచితూచి వ్యవవహరించాలి. ఖర్చుల విషయంలో పొదుపు అవసరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. దుర్గారాధన మంచిది.
వృషభ రాశి వారికి పనితీరు బాగుంటుంది. పెద్దలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచి ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి వారికి గ్రహబలం బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకున్నది సాధిస్తారు. సమయానుకూలంగా స్పందించాలి. ఆర్థికంగా బాగుంది. ఇష్టదేవతను స్మరించుకుంటే మంచిది.
కర్కాటక రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంది. మాట పట్టింపులు వద్దు. మనోవిచారం కలుగుతుంది. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
సింహ రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. కుటుంబంలో అందరి సహకారం ఉంటుంది. ఆంజనేస్వామిని సందర్శించడం వల్ల శుభాలు కలుగుతాయి.
కన్య రాశి వృత్తి ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. వాతావరణం బాగుంటుంది. విందలు, వినోదాల్లో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
తల రాశి వారికి చేసే పనుల్లో అలసట ఉంటుంది. పెద్దల మాట చద్దన్నం మూటగా భావించాలి. మనసుకు ఇబ్బంది కలిగే సంఘటనలుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శిస్తే మంచిది.
వృశ్చిక రాశి వారికి ఒక వార్త సంతోషాన్నిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి శ్రమ పెరుగుతుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. కీలకమైన పనులు పూర్తి చేస్తారు. ఆంజనేయ స్తోత్రం చదివితే మంచిది.
మకర రాశి వారికి అదృష్టం ఉంది. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో పురోగతి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభాలు కలిగిస్తుంది.
కుంభ రాశి వారికి పనుల్లో వేగం ఉంటుంది. అధికారుల సహకారం ఉంటుంది. కార్యసిద్ధి కలుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.
మీన రాశి వారికి ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు చేతికి వస్తుంది. కుటుంబ సభ్యులతో వాదాలకు దిగొద్దు. దుర్గా దేవి దర్శనం మంచిది.
ReplyForward
|