Mega Princess : మెగా ఇంటికి ప్రిన్సెస్ వచ్చి నేటికి సరిగ్గా 11 రోజులు. అంటే హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజు బారసాల. చిన్నారి వచ్చిన వేలా విశేషమో ఏమో గానీ మెగా ఫ్యామిలీకి అన్నీ మంచి శకునాలు కనిపిస్తున్నాయి. ప్రిన్సెస్ పాదం మోపడంతో మేగా ఫ్యామిలీకి మరిన్ని మంచి రోజులు వచ్చాయని జ్యోతిష్యులు కూడా చెప్పారట. చిన్నారి కడుపులో పడడంతోనే తండ్రి సినిమాకు ఆస్కార్ ఇప్పించింది. తన బాబాయ్ (వరుణ్ తేజ్)కు నిశ్చితార్థం అయ్యింది.
ఉపాసన జూన్ 20న హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ లో అర్ధరాత్రి 1:49 నిమిషాలకు ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఉపాసన దంపతులు కూతురికి ఏ పేరు పెడతారనే సందిగ్ధత నెలకొంది. అయితే కూతురు పుట్టిన తర్వాత మీడియా ముందుకు వచ్చి రాం చరణ్ మాట్లాడారు. తన లిటిల్ ప్రిన్సెస్ పేరు ఇప్పటికే కన్ఫమ్ అయ్యిందని, దాన్ని సంప్రదాయం ప్రకారం అనౌన్స్ చేస్తామని చెప్పారు. తనది ఎవరి పోలిక అంటూ ప్రశ్నించగా.. తన పోలికే అంటూ చెప్పాడు రాం చరణ్.
నేడు బారసాలకు గ్రాండ్ గా ఏర్పాటు చేశారట మెగా ఫ్యామిలీ. డెకరేషన్లు, దగ్గరి బంధువులకు ఇన్వైట్ కూడా చేశారట. ఈ బాధ్యతలను ఒక ఫేమస్ ఈ వెంట్ కంపెనీకి అప్పగించారట. ఇండస్ట్రీలో గుర్తుండిపోయేలా చేయాలని అనుకుంటున్నారట. అయితే సమయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. బారసాలకు కుటుంబ సభ్యులకు మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ తంతు ముగిశాక ఇండస్ట్రీలోని ప్రముఖులతో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేయనున్నారట. బారసాల ఏర్పాట్లను ఉపాసన తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
ఈ వేడుకలు ముగిసిన తర్వాత చరణ్ రెగ్యులర్ షూటింగ్ లలో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ కొనసాగుతుండగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో తన తర్వాతి ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. దాదాపు ఆయన షూటింగ్ ఆరు నెలలుగా గ్యాప్ ఇచ్చారు. తన భార్య డెలివరీ అయిన తర్వాత పాల్గొంటానని బాహాటంగానే చెప్పారు రామ్ చరణ్.