22.7 C
India
Tuesday, October 6, 2026
More

    WTC Championship : ఈరోజే ఆఖరు.. డబ్ల్యూటీసీ చాంపియన్షిప్ మనదేనా..?

    Date:

    WTC Championship
    WTC Championship, Final day

    WTC Championship : ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానంలోప్రతిష్టాత్మకంగా జరగుతున్న డబ్ల్యూటీసీ చాంపియన్ షిప్ ఫైనల్ తుది దశకు చేరుకుంది. ఆదివారం ఆఖరి రోజు కాగా, విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఫైనల్ మ్యాచ్లో 444 పరుగుల లక్ష్యాన్ని ఆస్ర్టేలియా, టీమిండియా ముందు ఉంచింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 168 పరుగులతో ఉంది. మరో 280 పరుగులు చేస్తే టీమిండియా, మరో ఏడు వికెట్లు పడగొడితే ఆస్ర్టేలియా విజేతగా నిలవనుంది. రెండింటికీ గెలిచేందుకు సమ అవకాశాలు ఉన్నాయి.

    అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రహానె ద్వయం క్రీజులో ఉండడంతో, భారత అభిమానులు కొంత ఆశతో ఉన్నారు. వీరి తర్వాత రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మరోవైపు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కూడా రాణిస్తే ఇక టీమిండియాకు తిరుగుండదు. డబ్ల్యూటీసీ చాంపియన్ షిప్ తో టీమిండియా స్వదేశానికి చేరుకుంటుంది. అయితే భారత క్రికెట్ అభిమానుల ఆశల్ని టీమిండియా వమ్ము చేయదని, రోహిత్ సేన కచ్చితంగా చాంపియన్ షిప్ గెలిచి తీరుతుందని సీనియర్లు చెబుతున్నారు.

    మరో వైపు ఇండియా మాజీ కెప్టెన్, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్ర్తి తాజాగా స్పందించాడు. 280 పరుగుల ఛేదన ప్రస్తుతం కష్టమేమి కాదు. బ్యాట్స్ మెన్ తమదైన శైలిలో ఆడితేనే గెలుపు సాధ్యం. కచ్చితంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే లాభం ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. మరోవైపు టీమిండియా గెలుపు ఖాయమని బౌలర్ షమీ కూడా స్పష్టం చేశాడు. ఈ విజయాన్ని అందుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, ఛేజింగ్ లో కచ్చితంగా సఫలమవుతామని స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ICC Titles : ఐసీసీ టైటిల్స్ లో అగ్రస్థానం ఆస్ట్రేలియాదే..!

    ICC Titles : క్రికెట్ లో అన్నింటా ఆధిపత్యం కనబరుస్తూ ఉంటే ఆస్ట్రేలియానే...

    Team India : కంగారెత్తించినా.. చివరకు విజయంతో సెమీస్ కు భారత్

    Team India : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో...

    Rohit Sharma : రోహిత్ శర్మ భీకర ఇన్సింగ్స్.. రికార్డులు బద్దలు

    Rohit Sharma : టీం ఇండియా సూపర్ 8 మ్యాచ్ లో...