వృషభ రాశి వారికి చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానికి తిండి, నిద్ర ఉండేలా చూసుకోవాలి. ప్రయాణాలు అంతగా కలిసి రావు. చంద్రశేఖర అష్టకం చదివితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మిథున రాశి వారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. దర్గాదేవిని పూజించడం వల్ల మంచి పలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. సంతోషంగా ఉంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గురు ధ్యాన శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఈశ్వర దర్శనం మంచిది.
కన్య రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. పంచమ చంద్ర బలం అంత బాగా లేదు. మనో నిబ్బరం కోసం ఆంజనేయ స్వామిని దర్శిస్తే మంచి లాభాలుంటాయి.
తుల రాశి వారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించకూడదు. ఈశ్వరాభిషేకం మంచి ఫలితాలు ఇస్తుంది.
వృశ్చిక రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
ధనస్సు రాశి వారికి వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. గణపతి ఆరాధన వల్ల ఇంకా మంచి ఫలితాలు వచ్చే ఆస్కారముంటుంది.
మకర రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాల్లో లాభాలుంటాయి. శివ పంచాక్షరి మంత్రం జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
కుంభ రాశి వారికి పనుల్లో ఆటంకాలున్నా చివరకు విజయం సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం చదివితే మంచిది.
మీన రాశి వారికి చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శివపార్వతుల సందర్శన మంచి ఫలితాలు ఇస్తుంది.
ReplyForward
|