Toliprema Re-release : పవన్ కల్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ. ఈ సినిమా అప్పుడు ఓ వండర్ క్రియేట్ చేసింది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసింది. అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇమేజ్ ను మరింత పెంచింది. ప్రేమ చిత్రాల కోవలో వినూత్నంగా హిట్ కొట్టింది.
ఖుషి, జల్సా సినిమాలు రీ రిలీజ్ చేసినట్లు తొలి ప్రేమను కూడా జూన్ 30న విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా మళ్లీ ఏం రికార్డులు సాధిస్తుందో తెలియడం లేదు. కీర్తిరెడ్డిని కొత్త కోణంలో చూపించిన కరుణాకరన్ సినిమా హిట్ కోసం సర్వశక్తులు ఒడ్డాడు. దీంతోనే అప్పట్లో రికార్డులు తిరగరాసింది. పవన్ కెరీర్ నే మలుపు తిప్పింది.
పవన్ కల్యాణ్ ను ప్రేమికుడిగా చూపించడంలో కరుణాకరన్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా రీ రిలీజ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా 300కు పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కూడా ఏం రికార్డులు బద్దలు కొడుతుందో తెలియడం లేదు. మొత్తానికి పవన్ కు మాత్రం ఈ సినిమా మరో సంచలనం సృష్టించనుందని చెబుతున్నారు.
తొలిప్రేమ సినిమా పవన్ కల్యాణ్ కు ప్రత్యేకమే. రీ రిలీజ్ తో కూడా కలెక్షన్లు కొల్లగొట్టనుంది. పవన్ అభిమానులకు పండగే. తొలిప్రేమను మరోమారు విజయవంతంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అభిమానుల జోష్ తో తొలిప్రేమ మరోసారి రికార్డులు తిరగరాయడం ఖాయమే అంటున్నారు. దీంతో ఈ సినిమా విడుదల సంచలనంగా మారనుంది.