
Krithi Shetty :
టాలీవుడ్ లో ఎప్పుడు కొత్త భామల సందడి ఉంటూనే ఉంటుంది.. మరి అలాంటి కొత్త భామల్లో కృతి శెట్టి ఒకరు.. ఈమె ఒకే ఒక్క సినిమాతో మోస్ట్ పాపులర్ అయ్యింది. ఉప్పెన సినిమాతో తెలుగులో ఉప్పెన సృష్టించిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయమైన స్థానం ఎంచుకుంది.. ఒక్క సినిమా తోనే ఈమె మంచి హిట్ అందుకుంది..
ఈ సినిమాలో ఈమె నటన, హావభావాలు అన్ని కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.. దీంతో వరుస ఆఫర్స్ వరించాయి.. వరుసగా సూపర్ హిట్స్ నే అందుకుంటూ యంగ్ హీరోలకు మంచి ఛాయిస్ గా నిలిచింది. అయితే ఈ మధ్య ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.. దీంతో ఈమె కెరీర్ కాస్త జోరు తగ్గింది అనే చెప్పాలి..
మూడు నాలుగు సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో ఈమె కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది అనే చెప్పాలి. ఇటీవలే నాగ చైతన్యతో చేసిన కస్టడీ సినిమా కూడా అమ్మడి అంచనాలను నిలబెట్టలేక పోయింది. ఇది కూడా ప్లాప్ అయ్యింది. దీంతో ఈమెకు మరో ఆఫర్ లేదు.. వరుస హిట్స్ అందుకుని ఆ తర్వాత అంతే స్థాయిలో ప్లాప్స్ అందుకుని ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
అందుకే గ్లామర్ డోస్ కాస్త పెంచేసి సోషల్ మాధ్యమాల్లో సందడి చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడి ఫోటోలను షేర్ చేయగా మంచి రెస్పాన్స్ లభిస్తుంది.. ఈమె లేటెస్ట్ పిక్స్ మంచి క్యూట్ లుక్స్ తో కనులకు విందుగా అనిపిస్తున్నాయి.. ఈ క్యూట్ పిక్స్ మీకోసం..