Tollywood Drugs Case :
సినిమా వాళ్లు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. ఇదివరకు చాలా మంది ఈ కేసులో ప్రమేయం ఉన్నా వారిపై చర్యలు తీసుకోలేదు. హీరోలు, దర్శకులు, హీరోయిన్లు కూడా ఇందులో ఉండటం గమనార్హం. డ్రగ్స్ పట్టుబడినప్పుడు ఏదో హడావిడి చేయడం తరువాత వదిలేయడం మామూలే. ఇప్పుడు మళ్లీ డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.
ఇందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. చౌదరి ఇచ్చిన రిపోర్టులో వారి పేర్లు బయట పెట్టారు. 12 మంది బుల్లితెర, వెండితెర నటులు, వ్యాపారులు కొకైన్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ ఉలిక్కిపడుతోంది. కేపీ చౌదరి ఆధ్వర్యంలోనే డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు చెబుతున్నారు.
ఈ మేరకు పోలీసులు డాటా విడుదల చేశారు. అందులో పలువురి పేర్లు ఉండటంతో వారి మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అషూరెడ్డి తో సహా పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. చౌదరి గూగుల్ డ్రైవ్ లో దాదాపు 9వేలకు పైగా ఫొటోలు ఉన్నట్లు చెబుతున్నారు. సెలబ్రిటీల పేర్లు కూడా ఇందులో ఉన్నాయని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ కేసులో అషూరెడ్డి పాత్ర ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. కేపీ చౌదరితో అషురెడ్డితో పాటు సురేఖ వాణి, జ్యోతితో పాటు పలువురి కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ కాల్స్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో వారి పాత్రలపై కూడా కూపీ లాగుతున్నారు. డ్రగ్స్ కేసు ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు. వీరి మధ్య జరిగిన సంభాషణల విషయంలో కూడా పో లీసులు లోతుగా దర్యాప్తు చేపడతున్నారు.