
Star harassed Hansika : టాలెంటెడ్ హీరోయిన్ లలో హన్సిక మోత్వానీ ఒకరు.. ఈమె తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.. ముందుగా తెలుగులో దేశ ముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ను వేరే లెవల్ లో ఆకట్టుకుంది. మరి అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో ఈ అమ్మడి అందం, అభినయానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.. ఆ తర్వాత వరుస అవకాశాలు వరించడంతో కొద్దికాలం కెరీర్ తెలుగులో బాగానే సాగింది.. అయితే వరుసగా ప్లాప్ రావడం తమిళ్ లో అవకాశాలు వరించడంతో అమ్మడు తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. ఇక అక్కడ వరుసగా సినిమాల్లో నటించి తిరుగులేని స్టార్ డమ్ అందుకుంది.
అక్కడి ప్రేక్షకులు ఈమెపై అభిమానంతో ఏకంగా గుడి కూడా కట్టేసారు.. అంతటి స్థాయికి హన్సిక ఎదిగింది. ఈ మధ్యనే బిజినెస్ మ్యాన్ సోహైల్ ను వివాహం చేసుకుని లైఫ్ లో కూడా సెటిల్ అయ్యి వైవాహిక జీవితాన్ని, కెరీర్ ను కూడా బిజీగా, ఆనందంగా గడుపుతుంది.. ఇదిలా ఉండగా ఈమె ఒక టాలీవుడ్ స్టార్ హీరోపై కామెంట్స్ చేసినట్టు తాజాగా వార్తలు వైరల్ అయ్యాయి.
కెరీర్ స్టార్టింగ్ లో ఒక టాలీవుడ్ టాప్ హీరో ఆమెను వేధించాడని.. డేటింగ్ చేయాలనీ ఆ హీరో ఈమెను చాలాసార్లు అడిగారని హన్సిక ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు గత రెండు రోజులుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.. ఈ వార్తలపై అమ్మడు స్పదించి అవన్నీ పుకార్లు మాత్రమే అని వార్తను పోస్ట్ చేసే ముందు నిజానిజాలను తెలుసుకుని చేయండి అంటూ ఈ రూమర్స్ ను ఖండించింది..