టమాట ధర పెరిగితే ఆటోమేటిక్ గా ఇతర కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. అది ఎప్పుడూ జరిగే తంతే. వర్షాకాలం ఆరంభం ధరలు మామూలుగా పెరుగుతాయి. కానీ ఇంత మొత్తంలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కూరగాయల జోలికి పోవడం లేదు. కొందామంటే ఏముంది రూ. 500 పట్టుకుపోతే సంచిలో కూరగాయలు కనిపించవు. అందుకే వాటిని కొనేబదులు పప్పు చేసుకోవడం మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారు. అసలే వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతుంటే ఇప్పడు టమాట ధర కలవరపెడుతోంది.
కూరల్లో రారాజు టమాట. అది లేనిదే ఏ కూర రుచించదు. అందుకే ప్రతి కూరలో దాన్ని వేయడం అలవాటు. పెరిగిన ధరల వల్ల దాని వైపు చూడటం లేదు. ధరలు తగ్గాక చూద్దాంలే అనే ధోరణిలో ఉన్నారు. టమాట ధర మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కిలో రూ. 160 పలుకుతోంది. ఇక్కడ నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు టమాట రవాణా అవుతోంది. దీంతో టమాటా ధ ఇంతలా పెరగడం దేనికి సంకేతం అంటున్నారు.
టమాట ధర దిగొస్తుందని అంటున్నారు. కానీ ఆ ఛాయలేవి కనిపించడం లేదు. ధర ఇలాగే ఉంటే కొనడం జరగదు. అంత ధర పెట్టి కొంటే ఏముంటుంది. జేబు గుళ్ల కావడం తప్ప. అందుకే ధర తగ్గాలని ప్రజలు చూస్తున్నారు. టమాట ధర దిగి రావడానికి పాలకులు కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే సామాన్యుడే టమాట వినియోగిస్తాడు. డబ్బున్న వాడికి ఏది కష్టం కాదు. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు. కానీ సామాన్యుడే సంకనాకిపోతాడు.
ReplyForward
|