Tomoto టమాట ధరలు చుక్కలు చూపించాయి. కిలో రూ. 200 పలకడంతో సామాన్యులు టమాటలు కొనడమే మానేశారు. ప్రస్తుతం టమాట ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు రూ. 65 లకు రావడంతో కాస్త ఊరట లభించినట్లయింది. టమాట పేదలను కరుణించింది. ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక కొనేందుకు ముందుకు వస్తున్నారు. అన్ని కూరల్లో టమాట వేయడం తప్పనిసరి. టమాట లేనిది కూర ఉండదు.
తెలుగు రాష్ట్రాల్లో రైతు బజార్లు, మార్కెట్లలో కిలో టమాట ధర రూ.65కు లభించడంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినట్లయింది. ఈ నేపథ్యంలో టమాట ధరలు తగ్గడం వల్ల ఇక వాటిని కొనేందుకు కాస్త చొరవ చూపుతున్నారు. సామాన్యులకు చుక్కలు చూపించిన ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. షాపింగ్ మాల్స్, కిరాణా షాపుల్లో కిలో టమాట రూ.120 వరకు పలుకుతోంది.
వర్షాకాలం ప్రారంభంలో రూ.200 పలికిన ధర ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. మార్కెట్ కు పెద్దమొత్తంలో టమాట రావడంతో ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధికంగా టమాట వస్తుండటంతో ధరలు తగ్గాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా టమాట ఎక్కువగా వస్తోంది.
ప్రస్తుతం ధరలు దిగి రావడంతో చాలా మంది టమాట కొంటున్నారు. ఇన్ని రోజులు టమాటలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ధర రూ.65కు దిగి రావడంతో చాలా మంది కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇన్నాళ్లు కోల్పోయిన రుచిని ఆస్వాదిస్తున్నారు. భవిష్యత్ లో మళ్లీ పెరుగుతుందని చెబుతున్నా అందులో వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు. టమాట ధరలు దిగి రావడం నిజంగా ప్రజలకు ఊరట కలిగించే అంశమే.