TOMATO : ఒక్కసారిగా టమోటా ధరలు అమాంతం పెరిగాయి. ఇదే ప్రజలకు ఇబ్బంది చేసింది. అయితే ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే మార్కెంటింగ్ శాఖను రంగంలోకి దించింది. టమోటాను కిలో రూ. 50 అందుబాటులో ఉండేలా చర్యలు ప్రారంభించింది. ఈ రోజు (గురువారం) నుంచి రాష్ర్ట్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉంచనున్నారు.
ఈ రోజు నుంచి అన్ని మార్కెట్లలోనే టమాటా సేకరించి వైఎస్సార్ కడప, కర్పూల్ జిల్లాల్లోని రైతు బజార్లలో రూ 50 చొప్పున టమాట విక్రయాలకు శ్రీకారం చుట్టారు. విశాఖ సహా మిగిలిన జిల్లాల్లో ఈరోజు నుంచి విక్రయించాలని నిర్ణయించారు. సబ్సిడీపై టమాటలు విక్రయించేందుకు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ధరలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటూనే ధరలు తగ్గేవరకు రైతు బజార్ల ద్వరా సబ్సిడీపైనా టమాటా, పచ్చి మిర్చి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నది.. ఇక ప్రధాన రైతు బజార్లలో సబ్సిడీపై టమాటా విక్రయాలు జరగనున్నాయి.
ReplyForward
|