24 C
India
Sunday, October 11, 2026
More

    Tomato : టమాటాలను కూడా దొంగలిస్తున్నారు

    Date:

     

    tomato
    tomato

    Tomato గతంలో బంగారం, వెండి ఉంటే దొంగలు పడి దోచుకుపోయేవారు. ఇప్పుడు కూరగాయలు కూడా దోచుకుపోతున్నారు. టమాటాకు ధర విపరీతంగా ఉండటంతో వాటిని కనిపిస్తేనే మాయం చేయాలని చూస్తున్నారు. ఇలా రెండు మూడు ఘటనలు కూడా జరగడం గమనార్హం. దొంగకు చెప్పే లాభం అన్నట్లుగా కూరగాయలను కూడా దొంగిలించే స్థితికి చేరుకున్నారంటే కూరగాయలు ఎంత ప్రియమైపోయాయో తెలుస్తోంది.

    ఇప్పటి వరకు కిలో టమాట రూ. 20 ఉండేది. కానీ ప్రస్తుతం వాటి ధర రూ. వంద దాటుతోంది. దీంతో వాటిని కొనేబదులు కొట్టేస్తే మంచి లాభం ఉంటుందని అనుకున్నారో ఏమో దొంగతనం చేయడానికి కూడా వెనకాడలేదు. వరంగల్ జిల్లాలో కూరగాయలు అమ్మే దుకాణంలో ఉన్న కూరగాయలు అన్ని దోచుకెళ్లారట. తెల్లవారి వచ్చి ఆ ఆసామి కొట్టు తెరవగా ఆశ్చర్యానికి గురయ్యాడట. దుకాణంలో ఉండే కూరగాయలన్ని మాయం అయ్యాయట. రాత్రికి రాత్రే దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారట.

    ఇంకా కర్ణాటక రాష్ట్రంలో రెండు ఎకరాల్లో టమాట పంట వేశారట. ధర బాగా ఉండటంతో రాత్రి దొంగలు పడి దాదాపు యాభై బస్తాల కాయలు తెంపుకెళ్లారట. దుకాణాలు, భూమిలో పండిన వాటిని కూడా వదలడం లేదంటే వారికి బంగారం, వెండి కంటే కూరగాయల ధరలే బాగా ఎక్కువగా అనిపించాయో ఏమో అని అందరు షాక్ అవుతున్నారు.

    ఇప్పుడు కూరగాయలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎక్కడ కనిపించినా దొంగతనం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే వరంగల్, కర్ణాటకలో టమాటాలు చోరీకి గురి కావడం సంచలనం కలిగించింది. ఇలా బంగారం, వెండి మాదిరి కూరగాయలను కూడా ఇలా దొంగతనం చేయడం వింతగానే తోస్తోంది. టమాటాలను భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gannavaram News : గన్నవరం దావాజీ గూడెంలో వరస దొంగతనాలు.. ఆందోళనలో బాధితులు..

    Gannavaram News : గన్నవరం దావాజి గుడెం రోడ్డులో ఒకేసారి మూ...

    BE CAREFUL: ఇవి వండకుండా తింటున్నారా…అయితే జాగ్రత్త

      ఆరోగ్యం కోసం పచ్చి కూరగాయలు, సగం ఉడికించినవి తింటే అనారోగ్య సమస్యలు...

    Tomoto టమాటా ప్రియులు ఇక ఊపిరి పీల్చుకోండి

        Tomoto టమాట ధరలు చుక్కలు చూపించాయి. కిలో రూ. 200 పలకడంతో...

    Tomato : అందరికీ పండుగే పో.. టమాటా ప్రియులకు ఇది శుభవార్త

    Tomato : టమాట నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటేనే వంటింట్లో...