23 C
India
Tuesday, October 6, 2026
More

    Jump With Lover : రేపు పెళ్లి..లవర్ తో జంప్.. సోదరికి దహన సంస్కారాలు చేసిన అన్నదమ్ములు..

    Date:

    Jump With Lover
    Jump With Lover

    Jump with lover : పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అన్న నానుడి బహూషా నిజమే కావచ్చు. ఎందుకంటే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పెళ్లిళ్లు చేసేవారు ఉన్నా.. నిశ్చితార్థాలు, శుభలేఖల పంపకాలు, పెళ్లి వేడుకలు మొదలు, మండపం వరకు అన్ని అరెంజ్ మెంట్స్ చేసినా పెళ్లి మాత్రం జరగడం లేదు. చాలా చోట్ల ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. అమ్మాయి ఇది వరకే మరొకరిని ప్రేమించడం.. కరెక్ట్ పెళ్లి పందిట్లోకి వచ్చే సమయానికి జంప్ కావడం.. అబ్బాయి అదనపు కట్నం అడగడం.. ఇరువైపులా బంధువులకు బేదాభిప్రాయాలు.. ఇలా దేశంలో ఈ మధ్య ఎన్నో రకాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ కూడా ఇలాంటి వాటిల్లో ఒక ఘటన జరిగింది. తెల్లవారి పెళ్లి ఉండగా వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. అవమానం భరించలేక ఆమె సోదరులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

    బిహార్ లోని పుర్నియాలో పెళ్లికి ముందు రోజు పెళ్లి కూతురు ప్రియుడితో లేచిపోయింది. వధువు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హల్దీ లాంటి ఆచారాలు కూడా పూర్తయ్యాయి. తెల్లరితే పెళ్లి అనగా వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. గుడిలో ప్రియుడిని పెళ్లి చేసుకొని వీడియో, ఫొటోలు వాట్సప్ లో కుటుంబ సభ్యులకు షేర్ చేసింది. దీంతో ఆగ్రహంలో ఉన్న కుటుంబంలోని యువతి సోదరుడు తన సోదరికి పిండ ప్రధానం చేశారు. సోదరి దిష్టిబొమ్మ తయారు చేసి మరీ పాడెపై అలంకరించి ఆమె ఫొటోలను దానిపై ఉంచాడు. ఊరేగింపుగా  శ్మశాన వాటికకు వెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడు.

    స్వీటి అనే యువతి ఇంటర్ చదువుతోంది. ఆమెకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇరు వైపులా బంధువులతో పాటు కాబోయే వధువు, వరుడు కూడా ఓకే అన్న తర్వాత పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇక మరుసటి రోజు ఊరేగింపు అనే సమయంలో స్వీటీ లేచిపోయింది. అయితే కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడిని స్వీటీ ప్రేమించింది. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే పెళ్లి వరకు తతంగాన్ని తీసుకువచ్చి ప్రియుడితో జంప్ కావాలని స్వీటీ పథకం పన్నింది. ఇందులో భాగంగానే పెళ్లి రోజు వరకు కుటుంబ సభ్యులకు తనకు పెళ్లి ఇష్టమేనన్నట్లు నటించింది. మహూర్తం ముందు రోజు జంప్ అయ్యింది.

    అయితే వధువు కుటుంబం వరుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్ కు వరుడితో వచ్చిన స్వీటీ తన ఇష్టపూర్తిగానే వెళ్లానని చెప్పింది. పెళ్లి కూడా తన ఇష్టపూర్తిగా చేసుకున్నట్లు పేర్కొంది. వధువు సోదరుడు సోదరికి పాడెపై ఊరేగించడం, దహన సంస్కారాలు నిర్వహించడం, పిండ ప్రదానం ఇలాంటి ఘటనలు చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Crime News : పరువు హత్య.. కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన తండ్రి

    Crime News : పుట్టినరోజు నాడే మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు పెద్దపల్లి జిల్లా...

    Madras High Court: వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించలేం.. హైకోర్టు తీర్పు..

    Madras High Court:  లైంగిక వేధింపులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు మరోసారి...

    Jalsa : పనిచేస్తున్న సంస్థకు కన్నం.. ప్రియురాలితో జల్సాలు

    Jalsa : ప్రియురాలితో మోజులో పడి పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసిన...