39.2 C
India
Thursday, June 1, 2023
More

    Sr. NTR Centenary Celebrations : ఎన్టీఆర్ శతజయంత్యువాలకు అగ్రహీరోలు

    Date:

    • ఆహ్వానించిన టీడీపీ

    Top heroes of Sr. NTR centenary celebrations : తెలుగు ప్రజలు, సినిమా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. కోట్లాది అభివమానుల గుండెల్లో ఆయన ఇప్పటికే అన్నే. ఆయనో తారక మంత్రం. తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకస్థాయికి తీసుకెళ్లిన నటసార్వ భౌముడు ఆయన. ఆయనను ఆదర్శంగా తీసుకున్న ఎందరో తెలుగు సినీ జగతిలో అగ్రహీరోలుగా ఎదిగారు. ఇప్పటికీ ఆయన చేసిన పౌరాణిక పాత్రలు మరెవరికీ సాధ్యం కాలేదంటే ఆయనకు నటనపై ఉన్న ధ్యాస మరెవరికీ సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం

    పాతికేళ్లయినా..

    ఎన్టీఆర్ ఈ ప్రపంచాన్ని వీడి పాతికేళ్లయినా ఇంకా ఆయన చిరస్మరణీయుడిగా నే మిగిలిపోయారు. ప్రస్తుతం ఆయన శతజయంత్యుత్సవాలు కొనసాగుతున్నాయి. ఆయన అభిమానులు, ఆయన పెట్టిన పార్టీ నాయకులు  శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో తెలుగు పరిశ్రమ అభివృద్ధి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడిగా ఎన్టీఆర్ అంటే ఎందరికో అభిమానం. ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా ఉత్తరాది అధిపత్యంపై ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం. అటు సినిమాల్లోనూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. అందుకే ఎన్టీఆర్ అంటే స్పెషల్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 కు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటి హీరోలకు ఇది సాధ్యమవుతుందా అంటే అది కలే.

    అయితే ఈ మహానేత శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో అతి పెద్ద వేడుకను ఈనెల 20న నిర్వహిచబోతున్నది. ఈ వేడకకు ఇప్పటికే అతిరథమహారథులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి.  హీరోలు వెంకటేశ్, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్ , పవన్ కల్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్,సహా మరికొందరు సినీ హీరోలకు ఈ వేడుకకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా వీరి ప్లెక్సీలను టీడీపీ ఏర్పాటు చేయించింది. టీడీపీ నేత టీడీ జనార్దన్ ఈ ఆహ్వానాలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వేడుకకు ఎవరెవరు వస్తారు అనేది.. మరో రెండ్రోజుల్లో తేలనుంది. మరోవైపు అట్టహాసంగా శతజయంత్యుత్సవాలు నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తున్నది.

    Share post:

    More like this
    Related

    మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

        టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

    ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

        తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

    అల్లుడితో లేచిపోయిన అత్త..!

          మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

    దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

          వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR cover page : ఇంగ్లిష్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..?!

    NTR cover page : యుగపురుషుడు నందమూరి తారక రామారావు గురించి...

    NTR Flexi war : ఎన్టీఆర్ మావాడే..! టీడీపీ, వైసీపీ ఫ్లెక్సీ వార్..

    ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఫ్లెక్సీ...

    Sr NTR fame : చిత్ర సీమలో అందరిచూపు ఎన్టీఆర్ వైపే.. దశ దిశలా పాకిన ఆయన కీర్తి..

    Sr NTR fame: నందమూరి తారక రామారావు ఈ పేరు చిత్ర...