
Tragedy in Vidisha : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషలో పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన సోదరి వివాహ వేడుకలో స్టేజీపై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఓ యువతి అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. డ్యాన్స్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ, ఇతర శారీరక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు హఠాత్తుగా గుండెపోటుతో యువతీ, యువకులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు పెరుగుతున్నాయి.