సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. తండ్రి కృష్ణ అంటే మహేష్ బాబుకు ఎనలేని ఇష్టం , గౌరవం , ప్రేమ. తండ్రి అడుగుజాడల్లో స్టార్ హీరోగా అంచలంచెలుగా ఎదిగాడు. మహేష్ బాబును బాలనటుడిగా పరిచయం చేసాడు కృష్ణ.
తాను నటించిన పలు చిత్రాల్లో మహేష్ కోసం కొన్ని ప్రత్యేక పాత్రలను సృష్టించారు. ఆ చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ కావడంతో చిన్నప్పుడే మహేష్ కు స్టార్ డం వచ్చింది. దాంతో తప్పకుండా మహేష్ భవిష్యత్ లో పెద్ద హీరో అవుతాడని అప్పుడే ఊహించాడు కృష్ణ. ఆయన అంచనాలను నిజం చేస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే స్టార్ హీరో అయ్యాడు మహేష్ బాబు.
తనని హీరోగా తీర్చి దిద్దిన గురువు కృష్ణ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మహేష్ బాబుకు 2022 చాలా చాలా బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి. ఎందుకంటే 2022 లో అంటే ఒక్క ఏడాదిలోనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. జనవరిలో అన్న రమేష్ బాబు మరణించగా సెప్టెంబర్ లో తల్లి ఇందిర మరణించింది. ఇక నవంబర్ లో తండ్రి కృష్ణ మరణించాడు దాంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు.