Biggboss 7 ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 7 వైపు పరుగులు తీస్తోంది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ ఇండియాలో అత్యధిక రేటింగ్ ను దక్కించుకొని టాప్ షోగా నిలిచింది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్లుగా ఎవరు ఉండబోతున్నారన్న విషయంపై సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు జబర్ధస్త్ ఫేమ్ ‘లేడీ’ ఎంటరవుతున్నట్లు తెలుస్తోంది.
సీజన్ 7కు సంబంధించి లోగోను టీం ఇప్పటికే రిలీజ్ చేసింది. గత సీజన్ 6 ప్రేక్షకులను కొంత నిరాశకు గురి చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీజన్ 7 మరింత క్రేజ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దీంతో రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. లోగోతో పాటు ఈ మధ్య కాలంలో ప్రోమోను వదిలారు. సీజన్ 7 సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుందని బుల్లితెర వర్గాల ద్వారా లీకులు వినిపిస్తున్నాయి.
ఈ సీజన్‌లో కొత్త కాన్సెప్టులతో వస్తున్నట్లు ప్రోమోలో నాగార్జున వెల్లడించాడు. దీని కోసం నిర్వాహకులు ఈ మధ్యనే పనులు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇక హౌజ్ వర్క్ ను కూడా పూర్తి చేశారట. ఇక కంటస్టెంట్ల ఎంపికలో షార్ట్ లిస్ట్ ను కూడా రెడీ చేసిందట టీమ్. ఇప్పుడు వారితో రెమ్యునరేషన్ విషయంలో డీల్ కుదుర్చుకుంటుందట. ఈ సారి ఎవరు రానున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ సీజన్ 7లో కొంత మంది సెలెబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు ప్రచారాలు కొనసాగుతున్నాయి. జబర్ధస్త్ ఫేమ్, ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తన్మయి ఉండబోతుందని తెలిసింది. దీంతో ఆమె పేరు ప్రస్తుతం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల కూడా ఇందులో ఉండబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. ఎవరు ఉండబోతున్నారో అన్నది వేచి చూడాలి మరి.