BJP : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కొన్ని గంటల్లో బాంబు పేల నుంది. ఇప్పటి వరకు అధ్యక్షుడి మార్పు ఉండబోదని స్పష్టం చేసిన అధిష్టానం ఈ విషయంపై మరికొన్ని గంటల్లో పూర్తి క్లారిటీ ఇవ్వనుంది. బండి సంజయ్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లలేమని కొంత కాలం నుంచి రాష్ట్ర నాయకత్వం అధిష్టానం వద్ద మొర పెట్టుకుంటుంది. అయితే ఢిల్లీ పెద్దలు కూడా దీనిపై ఏ విధంగా స్పందించడం లేదు. కానీ క్వశ్చన్ రేజ్ అయినప్పుడల్లా మార్పు ఉండబోదని చెప్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర నేతలు మాత్రం మార్చాల్సిందే అంటూ పట్టు బడుతున్నారు. ఈ సస్పెన్స్ కు నేడే పూర్తి తెరపడుతుందని తెలుస్తోంది.
కొంత కాలంగా పార్టీలోని ఇద్దరు కీలక నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ బీజేపీ ఇప్పటి వరకు ఎదుర్కొనలేదు. మంచి క్రమ శిక్షణ ఉన్న పార్టీగా బీజేపీకి ఆది నుంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ నుంచి అద్దెకు తీసుకున్న చందంగా తెలంగాణ శాఖలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. దీంతో అధిష్టానం కూడా తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంత కాలంలో ఢిల్లీలోని కీలక నేతలు కూడా పార్టీ అధ్యక్షుడిని మార్చేదే లేదని చెప్తూనే వస్తున్నారు. అయినా ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత సంతోష్, హోం మంత్రి అమిత్ షా గతం నుంచి రాష్ట్ర నాయకత్వ మార్పుపై సుధీర్ఘంగా చర్చిస్తూనే ఉన్నారు. అయితే ఢిల్లీలో సోమవారం (జూలై 03)న ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ బేటీ జరగనుంది. ఈ సమావేశంలో మారో సారి కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించడం, ఆయా రాష్ట్రాల్లోని అధ్యక్షుల మార్పులతో సహా కొన్న కీలక విషయాల గురించి చర్చించనున్నారు. ఇందులోనే బండి భవితవ్యం కూడా తేలవచ్చని తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన వరంగల్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో మార్చడం కుదరకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ReplyForward
|