
Urfi Javeed : ‘కొత్తొక వింత పాతొక రోత’ ఈ సామెత ఎప్పటి నుంచో ఉన్నది కదా.. ఏ రంగంలోనైనా ఏదైనా కొత్తగా వస్తే అందరూ వింతగా చూస్తారు ఇది కామనే. కానీ, ఫ్యాషన్ రంగంలో అయితే కళ్లకు అద్దుకుంటారు. ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతీ రోజూ ఏదో ఒక న్యూ లుక్ బయటకు వస్తూనే ఉంటుంది. ఇదొక మహా సముద్రమంటే అతిశయోక్తి కాదు. కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త స్టిచ్చింగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవుతాయి. ఈ మహా సముద్రంలో కొట్టుకుపోయిన వారు కొందరు ఉంటే.. దీని నుంచి తాగునీటిని తయారు చేసుకునే వారు కొందరు ఉన్నారు. ఇందులో మేటి అని చెప్పుకునే మోడల్ గురించి చెప్తే ఉర్ఫీ జావేద్ ఒకరు.
ఫ్యాషన్ ప్రపంచంలో ఉర్ఫీ జావేద్ ముందు వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్ తో కనిపిస్తూ ఫ్యాషన్ కే పాషన్ గా మారిపోయారు. ముస్లిం కుటుంబానికి చెందిన ఈమె ప్రముఖమైన మోడల్. ఎన్నో డిఫరెంట్ డ్రస్ లను వేసుకొని క్యాట్ వాక్ చేస్తూ ఎప్పుడూ మీడియాలో కనిపిస్తుంది. ఆమె వేసుకునే డ్రస్ లు వింత వింతగా ఉంటాయి. ఫ్యాషన్ ప్రపంచంలోనే ఎక్కువ ట్రెండీ వేర్ తో కనిపించింది ఈమెనే అంటే సందేహం లేదు. దాదాపు ఫ్యాషన్ క్లాత్ లు ఎక్కువగా షో టైములో మాత్రమే ధరిస్తారు. తర్వాత బయట వారితో తిరగడం చాలా తక్కువనే చెప్పాలి. డిజైనర్ వాటిని రిలీజ్ చేస్తేనే టాప్ షాపుల్లో అమ్మకానికి ఉంచుతారు. కానీ ఉర్ఫీ జావేద్ మాత్రం ఎప్పడూ ట్రెండీ వేర్ తోనే తిరుగుతుంది.
రీసెంట్ గా ఆమె వేసుకున్న డ్రస్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారింది. డ్రెస్ టాప్ ముందు భాగంలో సవరం (ఆడవారు వాడే పొడుగు వెంట్రుకలు) ఉంది. ఈ డ్రెస్ తో ఆమె ఫ్యాషన్ వీడియో గ్రాఫర్లకు కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదే సవరాన్ని వెనుక తలలో పెట్టుకుంటే పొడుగుజడతో అందంగా కనిపిస్తుంది. ముందు పెడితే ట్రెండీ వేర్ తో డిఫరెంట్ గా కనిపించింది.