Tribal woman : సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుందనేందుకు ఈ అమ్మాయి కథే నిదర్శనం.. సాధారణంగా యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే ఏం చేస్తాం షార్ట్ ఫిలిమ్స్, లేదంటే కామెడీ వీడియోస్, ఎవరి ఇంట్రస్ట్ కు తగ్గట్లుగా వారు వీడియోలు చూస్తారు. కానీ ఇక్కడో యువతి మాత్రం క్లాసులను వింటూ వింటూ ఏకంగా సివిల్స్ సాధించింది. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒడిశాకు చెందిన ‘బిని ముదులి’ సివిల్స్ కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో యూ ట్యూబ్ చూస్తూ ప్రిపేరయ్యింది. ఆ తర్వాత రాసిన పరీక్షలో 596వ ర్యాంక్ సాధించింది. ఈమె 2020లో సివిల్స్ రాసినా చివరి స్థానం కూడా సాధించలేకపోయింది.
24 ఏళ్ల బిని తండ్రి రామ్ ముదులి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంటవాడిగా పని చేస్తున్నాడు. తల్లి సునమలి అంగన్‌వాడీ వర్కర్. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కోచింగ్ కు డబ్బులు లేక యూట్యూబ్ వీడియోలు, ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్ చూసి ప్రిపేర్ అయ్యింది. తన గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో దగ్గర్లోని పట్టణానికి వెళ్లి చదువుకునేది. బిని ట్రైబల్స్ నుంచి సివిల్ సర్వీసెస్ సాధించిన మొదటి అమ్మాయి కావడం విశేషం.
View this post on Instagram