
Trisha : త్వరలో త్రిష సినిమాలు వదిలేయబోతుందట. మూవీస్ కు గుడ్ బై చెప్పబోతుందట. ఈ వార్త ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ కు నిద్రపట్టకుండా చేస్తోంది. ఇంతకీ మంచి ఫామ్ లోఉన్న త్రిష మూవీస్ సడెన్ గా వదిలేసి ఏం చేయబోతుంది అంటే. త్రిష పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతుందని సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్ గా ప్రకటించలేదు కాని.. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం చర్చ గట్టిగా నడుస్తోంది. అంతే కాదు త్రిష ఏ పార్టీలో చేరే అవకాశం ఉంద అనేది మరో చర్చ.
త్రిషకు హీరోవిజయ్ తోమంచి అనుబంధం ఉంది. వీరిద్దరిపై ఇప్పటికీ రకరకాల రూమర్స్ వస్తుంటాయి. ఈక్రమంలో త్రిష విజయ్ తో కలిసి ఆయన పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు. త్రిష విజయ్ పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు..త్రిష పార్టీలో చేరడం వల్ల చాలా విమర్షలు ఫేస్ చేయక తప్పదని తెలుస్తోంది.
అంతే కాదు త్రిష వల్ల విజయ్ తన భార్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇక త్రిష కనుక విజయ్ పార్టీలో నిజంగా చేరితే.. తమిళనాట మరో సంచలనం
అవుతందంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత..? అనేది తెలియల్సి ఉంది. ప్రస్తుతం త్రిష వరుసగా సినిమాలు సైన్ చేసింది. ఆ సినిమాలు కంప్లీట్ చేసిన తరువాత అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.






