
Trolling on Suma : యాంకర్ సుమ.. ఈమె గురించి అసలు ప్రత్యేక పరిచయమే అవసరం లేదు.. స్టార్ యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని ఆమె స్థానాన్ని మరొకరు దక్కించుకోలేని ఎత్తుకు ఎదిగింది.. యాంకరింగ్ అనే పదానికి ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా చెబుతారు. అందుకే ఈమెకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చి షో చేయిస్తారు.
ఒకవైపు బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూనే మరో వైపు ఈమె సినిమా ఈవెంట్స్ ను కూడా చేస్తుంటుంది.. ఈమె మలయాళీ అయినప్పటికీ తెలుగు వారు కూడా మాట్లాడలేంత అనర్ఘళంగా తెలుగును మాట్లాడుతుంది.. ఎక్కడ తప్పులు లేకుండా యాంకరింగ్ చాలా ఎంటర్టైనింగ్ గా చేస్తుంది.
అందుకే స్టార్ హీరోలు సైతం తమ ప్రమోషన్స్ సమయంలో సుమ యాంకరింగ్ తో ఒక ఇంటర్వ్యూ కానీ ఈమెతో ఈవెంట్ కానీ చేయాలని కోరుకుంటారు.. అలా సుమ ఎన్నో ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా యాంకరింగ్ ఫీల్డ్ లో రాణిస్తుంది.. అయితే అలాంటి సుమ తాజాగా ట్రోల్స్ కు గురి అయ్యింది. డబ్బు కోసం అలా చేసింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ట్రోలింగ్ కు గురి అవుతుందంటే..
ఈమె పర్సనల్ లైఫ్ లో తన భర్త రాజీవ్ తో విడిపోతుంది అని గత కొన్ని రోజులుగా రూమర్స్ వినిపించగా.. ఆమె ఈ వార్తలను ఖండించింది. అయినా ఆగకపోవడంతో వీలైనంత ఎక్కువుగా ఈమె తన భర్త రాజీవ్ తో కలిసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది..
ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానెల్ లో ఈమె తాజాగా కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్, పచ్చళ్ళు ప్రమోట్ చేస్తూ రాజీవ్ తో ఒక యాడ్ చేసింది. ఈ విషయంలోనే ఈమెపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.. డబ్బు కోసం ఇలాంటివి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు.. అవి ఇంటికి వచ్చే లోపే పాడై పోతున్నాయని.. ఇప్పటికే చాలా సంపాదించినా మీరు వీటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.