
Sweet Mangos : ఈ ఐపీఎల్ సీజన్ తుది దశకు చేరుకుంది. ఈ ఆదివారం జరిగే ఫైనల్ తో విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఇక మరో జట్టు ఏంటనేది క్వాలిఫయర్ 2 తో తేలిపోనుంది. గుజరాత్, ముంబై ఇండియన్స్ లో ఏదో ఒక జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో ఫైనల్ లో ఆడనుంది.
అయితే బుధవారం జరిగిన ఎలిమినేటర్ లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పై ఓడింది. అయితే ఈసారి లక్నో టీం కు చెందిన నవీన్ ఉల్ హక్ పై ఈ సారి తీవ్ర ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే నవీన్ కోహ్లితో గొడవకు దిగడమే కారణం. సోషల్ మీడియాలో కోహ్లీ కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టగా, ఇక విరాట్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు. ఇందులో ఐపీఎల్ ఆటగాళ్లు కూడా నవీన్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఇందులో స్వీట్ మ్యాంగోస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.. ఇంతకీ ఇదేంటంటే..
ఐపీఎల్ లో ఆర్సీబీ ముంబై చేతిలో ఓడిపోయాక, నవీన్ స్వీట్ మ్యాంగోస్ పోస్టు పెట్టి మరింత కవ్వించాడు. తాజాగా బుధవారం లక్నో కూడా ముంబై చేతిలో ఓటమి పాలయ్యింది .దీంతో ముంబై టీం కుచెందిన సందీప్ వారియర్, విష్ణు వినోద్, కుమార్ కార్తీకేయ స్వీట్ మ్యాంగోస్ అంటూ నవీన్ ను టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. చెడు చూడకు, చెడు మాట్లడకు, చెడు వినకు అన్నట్లుగా ఫోజు పెట్టి, డైనింగ్ టేబుల్ పై మ్యాంగోస్ పెట్టి న ఫొటోను ఇన్ స్టా లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ గా మారింది. అయితే కోహ్లీ పై అభిమానంతో ఇదంతా చేశారంటే.. చివరి మ్యాచ్లో నవీన్ రోహిత్ శర్మను అవుట్ చేసి, చెవులు మూసుకొని సంబురాలు చేసుకున్నాడు. ఇదే ముంబై ఇండియన్స్ సభ్యులు హర్ట్ అవ్వడానికి కారణమైంది. సో ఇదన్నమాట.. సీజన్లో వచ్చిన మామిడి కాయల కంటే ఈ ఐపీఎల్ ఆటగాళ్ల స్వీట్ మ్యాంగోస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి.