Aam Aadmi Party Mems : ఆమ్ ఆద్మీ పార్టీని మీమర్లు, నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ఇద్దరు కీలక నేతలపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. చివరకు కేజ్రీవాల్, అతని భార్య సునీతా కేజ్రీవాల్ ను కూడా వదల్లేదు. ఈ మీమ్స్ పొలిటికల్ సర్కిల్ తో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మార్లెన్ ఢిల్లీ ముఖ్యమంత్రి కానున్నారు. ఉదయం 11 గంటలకు జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా అతిషి పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా అతిషి నిలిచారు. అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబర్ 17 మంగళవారం తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిషి సీఎం అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణం నుంచే సోషల్ మీడియా మీమ్ ఆర్మీ మరింత యాక్టివ్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయాన్ని ఫన్నీ రీతిలో స్వాగతిస్తున్నది.
మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్ లై సెటైర్లు.
ఆమ్ ఆద్మీ పార్టీ కీలకనేతలైన మనీష్ సింగ్ సిసోడియా, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దాలపై నెటిజన్లు మీమ్స్ తో చెలరేగిపోతున్నారు. అయ్యో సీఎం పదవి తప్పిపోయిందంటూ పలు చిత్రాల్లో నటులు ఏడ్చే వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ నవ్వలు పూయిస్తున్నారు.
#Atishi Marlena is the new Delhi CM..
Manish Sisodia : pic.twitter.com/17oEGvqlj9
— UmdarTamker (@UmdarTamker) September 17, 2024
మనీస్ సిసోడియా మీమ్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ లోని ఓ సన్నివేశాన్ని మనీష్ సిసోడియాకు అపదిస్తూ మీమ్స్ వేశారు. శివాజీ సినిమాలో అధికారులందరికీ లంచాలు అడుగుతుంటారు. ఓ మంచి పని చేద్దామన్నా లంచం ఇవ్వాల్సిందేనా … షిట్ అంటూ రజనీకాంత్ బల్లను కొట్టే సన్నివేశాన్ని మనీష్ సిసోడియాకు అపాదించారు. ప్రస్తుతం మనీష్ సిసోడియా పరిస్థితి ఇదేనంటూ మీమ్ వేయగా తెగ వైరల్ అవుతున్నది.
మరో మీమ్ కూడా ఆకట్టుకుంటున్నది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ప్రాంక్ వీడియో. ఇందులో ఓ సాధారణ వ్యక్తి సంచి పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటాడు. అదే సమయంలో ఓ విదేశీ యువతి హగ్ ఇస్తానంటూ రెండు చేతులు చాచి ముందుకెళ్తుంది. ఈ సాధారణ వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్లగా అంతలోనే ఆమె అతని వెనకున్న తన ప్రియుడిని హగ్ చేసుకుంటుంది. ఆ విదేశీ యువతిని ఢిల్లీ సీఎం పదవిగా, సాధారణ వ్యక్తిని మనీష్ సిసోడియాగా పేర్కొంటూ వేసిన మీమ్ ఉత్తరాదిన వైరల్ అయ్యింది. ఇలా పలు రకాల వీడియోలు, కార్టూన్లతో నెటిజన్లు ఆప్ నేతలను ఓ ఆట ఆడుకుంటున్నారు.
Manish Sisodia : Meri jagah #Atishi ko Chief Minister of Delhi bana diya 😭😭
Arvind Kejriwal :pic.twitter.com/drMXKYbzMt
— UmdarTamker (@UmdarTamker) September 17, 2024
ఏకంగా కేజ్రీవాల్ పైనే మీమ్..
మరో నెటిజన్ ఏకంగా కేజ్రీవాల్, అతని భార్య సునీతా కేజ్రీవాల్ పైనా మీమ్స్ వేశారు. ఓ హిందీ చిత్రంలోని సీన్ పై అరవింద్ కేజ్రీవాల్, అతని భార్య సునీతా కేజ్రీవాల్ మధ్య సంభాషణగా మీమ్ వేశారు. మనం బాధలో ఉన్నామని సునీతా కేజ్రీవాల్ అంటుండగా, మనకన్నా మరో ఇద్దరు అంతకన్నా ఎక్కువ బాధలో ఉన్నారంటూ ఆప్ నేతలను గుర్తుకు తెచ్చేలా ఫొటోలు వేసి నవ్వించాడు.
#atishi #DelhiChiefMinister pic.twitter.com/kfln3hmNJd
— खुरपेंच (@khurpenchh) September 17, 2024