Atlee’s Marriage Trolls :
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో అట్లీ కుమార్ ఒకరు.. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాల్లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు అట్లీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగి పోతుంది. ఈయనను ఆకాశానికి ఎత్తే వారు చాలా మంది ఉన్నారు.. అయితే ఇప్పుడు ఇది పరిస్థితి..
అయితే ఒకప్పుడు మాత్రం ఈయనపై ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి.. సౌత్ ఇండియాలోనే ఎక్కువుగా ట్రోల్స్ కు గురైన డైరెక్టర్ ఇతడే.. నిండా 36 ఏళ్ళు లేకుండానే ఈయనపై ఈ రేంజ్ ట్రోల్స్ వచ్చిన కూడా పోజిటివిటీతో ముందుకు వెళ్తున్నాడు. రోబో షూటింగ్ సమయంలో శంకర్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన అట్లీ తన టాలెంట్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు..
రోబో సినిమా మొత్తానికి రజినీకాంత్ కు డూప్ గా నటించిన అట్లీ ఆ తర్వాత రాజా రాణీ సినిమాతో డైరెక్టర్ గా మారారు.. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో సూపర్ హిట్ అయ్యి అట్లీ అంటే డైరెక్టర్ గా అందరికి తెలిసింది.. ఇక ఆ తర్వాత ఏడాదికి అట్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ ప్రియా. వారిది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం.. దీంతో అట్లీ తెలుగింటి అల్లుడే అని చెప్పాలి.
ఈమె కూడా సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా ఈయన పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో వారిద్దరి ఫోటోలు చూసి కాకి ముక్కుకు దొండపండు అంటూ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసారు అంటూ అట్లీ తెలిపారు. ఏది ఏమైనా ట్రోల్స్ ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ అట్లీ ఈ రోజు స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.